మే 6 తర్వాత జర్నలిస్టులతో కేసీఆర్ సమావేశం

మే 16నుంచి స్వచ్ఛ హైదరాబాద్

హైదరాబాద్ : హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో మే నెలలో తొలి అడుగులు వేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందుకోసం రాష్ట్రంలోని న్యూస్‌ ఛానళ్లు, పత్రికా ప్రతినిధులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు మే 6 తరువాత సమావేశం నిర్వహిస్తారు. హైదరాబాద్‌ నగర సమగ్ర అభివృద్దికి, స్వచ్చ హైదరాబాద్‌ నిర్వహణకు కావలసిన సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నేరుగా మీడియా సంస్థల బాధ్యులతో చర్చిస్తారు.

నగరంలో నిర్వహించే స్వచ్చ్‌ హైదరాబాద్‌ కార్యక్రమంలో అన్ని వర్గాలను భాగస్వాములను చేసేందుకు మీడియా ముఖ్యమైన పాత్రను పోషించాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు. కాగా మే 16న జరిగే స్వచ్చ హైదరాబాద్‌ కార్యక్రమానికి గవర్నర్‌తో పాటుగా కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, హైదరాబాద్‌ ఎంపి అసదుద్దీన్‌ ఓవైసీలను ప్రత్యేకంగా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆయా ప్రాంతాల్లో జరిగే స్వచ్చ హైదరాబాద్‌ కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యేలను భాగస్వాములు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *