
దాదాపు మూడు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న గడియ రానే వచ్చింది. జక్కన్న రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి విడుదలకు సిద్ధమవుతోంది. మే 15న సినిమా ఫస్ట్ పార్ట్ ను విడుదల చేస్తున్నట్టు రాజమౌళి ప్రకటించారు.
రాజమౌళి ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేశారు. అందులో తన బాహుబలి సినిమాను మే 15న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఒక పాట మినహా సినిమా మొత్తం కంప్లీట్ అయ్యిందని చెప్పాడు. ప్రస్తుతం ప్రోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని.. సినిమా సమ్మర్ కానుకగా రిలీజ్ అవుతుందని చెప్పారు.