Breaking News

మేరే పాస్ ముస్లిమ్స్ హై

owaisi-meets-kcr(1)F

ఎంఐఎం అధినేత.. హైదరాబాద్ లో ముస్లింలకు ప్రధాన ప్రతినిధి అయిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో నిలవాలని నిర్ణయించుకున్నారు. నిన్న వారి పార్టీ కార్యాలయం దారుస్సలంలో నిర్వహించిన నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

కాగా ఇన్నాళ్లు టీఆర్ఎస్ తో కలిసి గ్రేటర్ ఎన్నికలకు ఎంఐఎం వెళ్తుందని అందరూ భావించారు. పాతబస్తీలో ఎంఐఎంకు గట్టి పట్టు ఉంది. గతంలో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ఎంఐఎం పొత్తు కటీఫ్ చేసుకుంది. అధికార టీఆర్ఎస్ కు సాన్నిహిత్యంగా మెలిగుతోంది. అందరూ టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి బరిలోకి దిగుతారనే భావించారు. కానీ ఒక్కసారిగా అసదుద్దీన్ ఒంటిరి పోటీ అని ప్రకటనతో అందరూ ఖంగుతిన్నారు.

టీఆర్ఎస్ పోలీస్ సంస్కరణలే కారణం

కాగా ఎంఐఎం టీఆర్ఎస్ ను దూరం పెట్టడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటి పోలీస్ సంస్కరణలు.. పోలీసులకు అధునాతన వాహనాలు టెక్నాలజీ, కార్డన్ సెర్చ్ లకు పర్మిషన్ ఇచ్చి ముస్లింయువతను టార్గెట్ చేశారని ఎంఐఎం ఆరోపణ. పోలీసుల వల్ల ప్రధానంగా ముస్లింలు ఇబ్బంది పడుతున్నారని..దీని వల్ల మా ఓటు బ్యాంకు బాగా దెబ్బతిందని.. అందుకే టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే ఓట్ల పడవనే ఉద్దేశంతోనే అసదుద్దీన్ టీఆర్ఎస్ తో దోస్తీ కట్ చేశారు.

టీఆర్ఎస్ కు బలం లేకపోవడం కారణమే..

కాగా హైదరాబాద్ లో టీఆర్ఎస్ కు అసలు బలం లేకపోవడం ఎంఐఎం టీఆర్ఎస్ దోస్తీ కట్టకపోవడానికి మరో కారణం. కాంగ్రెస్ కు అంతో ఇంతో బలం ఉన్నా.. టీఆర్ఎస్ కు హైదరాబాద్ లో బలం లేదు.. నాయకులు లేదు.. దీంతో వారితో పొత్తు కన్నా ఒంటిరి పోటీయే మేలని అసదుద్దీన్ భావించి నిర్ణయించారు. దాంతో మొత్తం ముస్లిం ఓట్లు మాకే అన్న ధీమా కూడా అసదుద్దీన్ ఈ నిర్ణయానికి కారణం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *