మేయర్, కార్పొరేటర్లకు క్లాస్ పీకిన మంత్రి ఈటల

2-etela-rajender

మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్లోని తన కార్యాలయంలో మేయర్, కార్పొరేటర్లకు క్లాస్ పీకడం సంచలనం రేపుతోంది.. ఎప్పుడు సైలెంట్ గా ఉండే ఈటల వారిపై శివాలెత్తడం అందరినీ విస్మయపరిచిందట.. ఇంతకీ అసలు విషయం ఏంటంటే ఎప్పుడు అనిశ్చితికి మారు పేరుగా ఉండే రామగుండం మున్సిపాలిటీలో మేయర్ కొంకటి లక్ష్మీనారాయణకు, అక్కడి ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు అస్సలు పడదట.. టెండర్ల విషయంలో ఎవరికి వారు బెట్టుకుపోవడంతో మేయర్ తోపాటు కొందరు కార్పొరేటర్లు రాజీనామాకు సిద్దపడి మంత్రి ఈటల రాజేందర్ కు ఫోన్ లో విన్నవించారట.. దీంతో శివాలెత్తిన ఈటల వారందరిని హైదరాబాద్ కు పిలిపించారట..

హైదరాబాద్ వచ్చిన తర్వాత భారీ క్లాస్ పీకరట. . టీఆర్ఎస్ తరఫున గెలిచిన మీరు ఎన్నడూ పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేయలేదని పైసల కోసం కొట్టుకుంటున్నారని మండిపడ్డారట.. ఇలానే వ్యవహరిస్తే మీకు అడ్రస్ లేకుండా చేస్తానని చెప్పి పంపించారట.. దీంతో వారందరూ రాజీనామా లను వెనక్కి తీసుకొని వెళ్లిపోయారట..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *