మేక కడుపున మనిషి పోలిన పిల్లలు

బెంగళూరు, ప్రతినిధి : మేక కడుపున మనిషిని పోలిన రెండు పిల్లలు పుట్టడం సంచలనం రేపింది. కర్నాటకలోని హెచ్.డీ.కోట్ తాలూకా షోలాపూర్ గ్రామంలో ఇదో విచిత్రం చోటు చేసుకుంది. అక్కడ భాస్కర్ అనే వ్యక్తికి చెందిన మేక అచ్చం మనిషి పోలికలతో ఉన్న రెండు పిల్లలను కన్నది. అయితే ఇవి కాసేపటికే మరణించాయి. మొదట మగపిల్ల ఈ ఉదయం ఆరున్నర గంటలకు పుట్టగా,  తరువాత పుట్టిన రెండోది ఆడపిల్ల అని భాస్కర్ తెలిపాడు. వీటికి కళ్ళు, ముక్కు, నోరు అంతా మనిషి పోలికలే ఉన్నా చెవులు. కాళ్ళు మాత్రం మేకను పోలి ఉన్నాయన్నాడు.

ఇప్పటివరకు దీనికి పుట్టిన పది పిల్లలు సాధారణంగానే ఉన్నాయి అని అతగాడు చెప్పాడు. ఏది ఏమైనా ఈ విచిత్రం ఆ గ్రామమంతా సంచలనం రేపింది. జనాలు పెద్దసంఖ్యలో వచ్చి ఈ వింతను చూశారు. ఇలా విచిత్రంగా మేకపిల్లలు పుట్టడం అరిష్టమని. ఈ మేక పిల్లల్ని భూమిలో పాతిపెట్టాలని కొందరు భాస్కర్‌కు సలహా ఇచ్చారు. అయితే మరికొందరు వీటిని భద్రపరచాలన్నారు. కాగా- జన్యుపరమైన లోపాలవల్ల అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుందని అభ్యుదయవాదులు అంటున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.