మేం గొప్పొల్లం సామీ..!

హైదరాబాద్, ప్రతినిధి : మొత్తానికి సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని ఒప్పుకున్నారు. పక్కనున్న ఏపీతో తమకు పోలికే లేదని.. అది లోటు బడ్జెట్ తో కూనరిల్లుతోందని.. తాము మాత్రం దేశంలోనే ధనిక రాష్ట్రంగా గుజరాత్ సరసన నిలుచున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర రైల్వే బడ్జెట్, తెలంగాణను ధనిక రాష్ట్రంగా ఆర్థికసంఘం గుర్తించడం సంతోషం వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రంగా అప్పులు మరిన్ని తెచ్చుకోవడనికి మనకు అవకాశం ఉంటుందని.. ఆ సౌలభ్యాన్ని వినియోగించుకొని తెలంగాణను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు.

అంతేకాదు.. కర్ణాటకతో మాట్లాడి ఆలమట్టినుంచి నీటిని తెచ్చుకొంటామని సెలవిచ్చారు. రోబోయే మూడేళ్లలో తెలంగాణను మిగులు విద్యుత్  రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

మొత్తానికి సీఎం కేసీఆర్ మనం (తెలంగాణ ప్రజలం) గొప్పళ్లమని మీడియాతో ముసిముసిగా నవ్వుతూ పలికారు. అందుకే ఉద్యోగులకు దేశంలో ఎవరూ ఇవ్వలేనంతంగా 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని చెప్పారు. దీన్ని వివిధ పక్షాలు విమర్శించినా తమకు ఆర్థిక స్తోమత ఉంది కాబట్టే ఇచ్చామని చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *