
హర్యానా, ప్రతినిధి : డేరా సచ్చా సౌదా చీఫ్ గురుమీత్ రామ్‌రహీమ్ సింగ్ ప్రధాన పాత్రధారిగా నటించిన మెసెంజర్ ఆఫ్ గాడ్ సినిమా విడుదలను నిలిపివేశారు. ఈ వివాదాస్పద చిత్రం విడుదలను నిరసిస్తూ.. పంజాబ్, హర్యానా, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో పలువురు పెద్ద ఎత్తున నిరసనలు కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ప్రభుత్వం.. శాంతిభద్రతలు కాపాడేందుకు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రంగంలోకి దింపింది.
ఎంఎస్‌జి సినిమాలో సిక్కులను రెచ్చగొట్టే విధంగా రామ్ రహీం సింగ్ డైలాగులున్నాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డేరా సచ్చా సౌదా చీఫ్‌పై పలు క్రిమినల్ కేసులున్నాయని సిక్కులు ఆరోపిస్తున్నారు. రామ్ రాహీం సింగ్‌కు మద్దతుగా డేరా సచ్చా సౌదా కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగడంతో హర్యానాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.