ఎమ్ సీ డైట్ తాగి మోసపోయమంటూ కేసు

మద్యం తాగితే ఎక్కడైనా మంచి జరుగుతుందా..? కానీ మద్యం కంపెనీల ప్రకటనలు చూసి మోసపోయారు వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు అమాయకపు ‘మందు’ బాబులు.. ఫుల్లుగా ‘మెక్ డెవల్(ఎమ్ సీ) డైట్ తాగి ఫలితం ఇవ్వకపోవడంతో వినియోగదారుల ఫోరంలో ఆ కంపెనీపై కేసుపెట్టారు.

‘మెక్ డెవల్(ఎమ్ సీ) డైట్’ అనే విస్కీలో ‘గార్బియానా’ అనే ఔషధి మొక్క పదార్థం ఉందని.. ఆ విస్కీని సేవిస్తే బరువు తగ్గుతారని.. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుందని ఆ కంపెనీ పెట్టెపై ముద్రించింది. ఆ ప్రకటనను నిజమేనని నమ్మిన వరంగల్ జిల్లా జనగామ పట్టణానికి చెందిన ఓ వ్యాపారి జి.వెంకటరమణ, మరో ప్రైవేటు ఉద్యోగి పి.వెంకటరమణకుమార్ లు ఈ విస్కీ(ఫుల్ బాటిల్)ను రూ.430 వెచ్చించి కొనుగోలు చేశారు.

కొద్దిరోజులపాటు తాగారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో అనుమానం వచ్చిన వారు డాక్టర్ ను సంప్రదించారు. డాక్టర్ పరీక్షించి  డైట్ మెట్ ఎమ్ సీ వల్ల బరువు తగ్గడం కాని, కొలస్ట్రాల్ నియంత్రణలో ఉండడం గానీ జరగలేదని.. వాస్తవంగా విస్కీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని డాక్టర్ రిపోర్టు ఇచ్చాడు.

ఆ డాక్టర్ ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా ఆ మద్యం తాగిన వ్యక్తులు న్యాయవాది సహాయంతో వరంగల్ వినియోగదారుల ఫోరంలో మద్యం తయారు చేసే బెంగళూరులోని ‘యూనైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్, దాని చైర్మన్, తెలంగాణ ఫ్రొహిబిషన్ ఎక్సైజ్ కమిషనర్, వరంగల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, మద్యం అమ్మిన పార్క్ లైన్ వైన్స్ పై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును వినియోగదారుల ఫోరం స్వీకరించి విచారణ చేపట్టింది. ఫిర్యాదులో పేర్కొన్న కంపెనీలకు, యజమానులకు నోటీసులు పంపించింది.

మొత్తానికి సరదాగా తాగే మద్యం గోల చిలికిచిలికి ఆ కంపెనీ మెడకు, అమ్మిన అధికారులు, వైన్ షాప్ యజమానులకు, పేపరోళ్లకు తెలిసి కంపెనీ మద్యం అసలు స్వరూపం బయటపడినట్టైంది. సో మందు బాబులు ఇప్పటికైనా తెలుసుకోండి ‘మద్యంపానం ఆరోగ్యకరం కాదు’

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *