మెదక్ ఏరియా హాస్పిటల్ లో 100 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి

మెదక్ ఏరియా హాస్పిటల్ లో 100 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి

మెదక్ ఏరియా హాస్పిటల్ లో 100 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి.

అలాగే 5 పడకల డియాలిసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

అనంతరం ప్రసూతి కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి

ఆ తర్వాత జరిగిన సమావేశంలో మాట్లాడిన మంత్రి

వచ్చే రెండేళ్లలో వైద్య రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతాం కేసీఆర్ కిట్ల పథకం ప్రారంభం తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసూతిలు 50శాతం దాటాయి. సర్కార్ దవాఖానాల్లో ప్రసూతిలు పెంచడానికి మాతా శిశు ఆరోగ్య కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. మరికొద్ది నెలల్లోనే మెదక్ లో మాతా శిశు ఆరోగ్య కేంద్రం పని చేసేలా చేస్తాం. డియాలిసిస్ కేంద్రంతో ఆ వైద్యం అవసరం ఉన్న పేషంట్లకు ఎంతో మేలు జరుగుతుంది.  కేసీఆర్ ముందు చూపుతో అనేక సంస్కరణలు వైద్య శాఖలో చేపట్టాం. కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం వంటి ఆరోగ్యకర పథకాల విజన్తో ఆరోగ్య తెలంగాణకు బాటలు వేస్తున్నారు. జిల్లాల విభజన ఎంతో ఉపయోగకరంగా ఉంది.  త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా స్టాఫ్ కొరత తీరుతుంది. రోగాలు రాకుండా జాగ్రత్త పడటం, తొందరగా వాటిని గుర్తించడం, వెంటనే చికిత్సకు వెళ్లడం వంటి అనేక అంశాలు మీద దృష్టి పెట్టి పని చేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫెర్టిలిటీ కేంద్రాన్ని గాంధీలో ప్రారంభించాం.  సబ్ సెంటర్స్ బలోపేతం చేస్తున్నాం. కొత్తగా సబ్ సెంటర్స్ ని ఏర్పాటు చేయనున్నాం మెదక్ కు 20 పడకల నవజాత శిశు సంరక్షణ (sncu) కేంద్రాన్ని ఇస్తున్నాం.  paliative సెంటర్ ని కూడా అందిస్తాం

*పద్మా దేవేందర్ రెడ్డి కామెంట్స్*

రాష్ట్రంలో వైద్య రంగం అద్భుతంగా పని చేస్తున్నది. మెదక్ హాస్పిటల్ ని 300 పడకలకు పెంచాలి. మరిన్ని సదుపాయాలు పెంచాలి.

*పర్యాద కృష్ణమూర్తి కామెంట్స్*

నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అన్న దుస్థితి నుంచి నేను వస్తా బిడ్డో అనే మంచి పరిస్థితి వచ్చింది. ఈ ఘనత సీఎం కేసీఆర్ కి, మంత్రి లక్ష్మారెడ్డి గారికి దక్కుతుంది.  ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ రాజమణి, స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా వైద్య అధికారి సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.

laxma reddy 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *