
తెలంగాణ చీఫ్ సెక్రటరీనికి హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ విజ్ఞప్తి
హైదరాబాద్ చరిత్రలో అతిపెద్ద మైలురాయిగా నిలిచిపోనున్న మెట్రోరైల్‌లో అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఉచిత ప్రయాణం చేసేందుకు వీలుగా తగు చర్యలు తీసుకోవాలని ప్రెస్‌క్లబ్ హైదరాబాద్ తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎస్పీసింగ్‌కు విజ్ఞప్తి చేసింది. గురువారం సాయంత్రం ప్రెస్‌క్లబ్ హైదరాబాద్ అధ్యక్ష, కార్యదర్శులు రాజమౌళిచారి, ఎస్.విజయ్‌కుమార్‌రెడ్డిల ఆధ్వర్యంలోని సచివాలయ జర్నలిస్టుల బృందం చీఫ్‌సెక్రటరిని కలిసి నవంబర్ 28న ప్రారంభమైయ్యే మెట్రో రైలులో అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకు ఉచితంగా ప్రయాణాన్ని అనుతించాలని కోరారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైళ్లు, రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో ఇస్తున్న రాయితీల మాదిరిగానే మెట్రోరైల్ యాజమాన్యంతో అవగాహన కుదుర్చుకోవాలని కోరారు.ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన ఎస్పీ సింగ్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయాన్ని ప్రకటిస్తామన్న బరోసానిచ్చారు.చీఫ్ సెక్రటరీని కలిసిన ప్రతినిధి బృందంలో ప్రెస్‌క్లబ్ కార్యవర్గ సభ్యులు నరేందర్ పద్మశాలి, రాజేష్,అనిల్‌కుమార్‌లతో పాటు సచివాలయ జర్నలిస్టులు శ్రీనివాస్, ఆర్యన్, తిప్పన కోటిరెడ్డి, చారి తదితరులున్నారు.