
హైదరాబాద్, ప్రతినిధి : రేపటి నుండి నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. మెట్రోరైలు పనుల కారణంగా పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు సీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. చాదర్ ఘాట్ చౌరస్తా నుండి మలక్ పేట ఫ్లైఓవర్ వరకు బారికేడ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రెండు నెలలపాటు వాహనాల రాకపోకలు నిలిపివేస్తూ బారికేడ్లు నిర్మించనున్నట్లు చెప్పారు. రేపటి నుండి ట్రాఫిక్ ఆంక్షలు అమలుకానున్నట్లు స్పష్టం చేశారు. వాహనాలకు వేర్వేరు మార్గాలు కేటాయిస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. దిల్ సుఖ్ నగర్ నుండి కోఠి వెళ్లే వాహనాలు ముసారాంబాగ్ దగ్గర మళ్లింపు, ఎంజీబీఎస్ నుండి వెళ్లే వాహనాలు చాదర్ ఘాట్ దగ్గర మళ్లింపు, చాదర్ ఘాట్ నుండి నింబోలి అడ్డా, అంబర్ పేట మీదుగా దారి మళ్లించనున్నారు.