
మెగాస్టార్ 150 మూవీకి హీరోయిన్ ఓకే అయ్యింది. హీరోయిన్ కోసం జరుగుతున్న కసరత్తులో చివరకు అరుంధతికే అవకాశం దక్కింది. సినిమా ప్రారంభం కాలేదు. ఇంకా కథ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ప్రస్తుతం అనుష్క ఒకటిగా ఉంది. ఆమెను చిరంజీవితో జోడి కట్టించాలని ప్రయత్నించగా అనుష్క సైతం ఒప్పుకుంది.
చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ 150వ చిత్రానికి చిరంజీవి ద్విపాత్రాభినం చేస్తున్నారు. ఈ సినిమాకు రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. తమిళ హిట్ మూవీ కత్తి నేపథ్యంగా సినిమా తెరకెక్కుతోంది..