‘మెగా’ అండతో గెలిచిన రాజేంద్రప్రసాద్

హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రాజకీయ ఎన్నికలను తలపించాయి. జయసుధ, రాజేంద్రప్రసాద్ వర్గాల మధ్య యుద్ధ వాతావరణమే నెలకొంది. జయసుధకు మా మాజీ అధ్యక్షుడు మురళీ మోహన్, రాజేంద్రప్రసాద్ కు మెగా ఫ్యామిలీ, నాగేంద్రబాబు అండగా నిలిచారు.

ప్రచార పర్వంలో ఇరువురు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. మురళీ మోహన్ బ్యాచ్ డబ్బు, అధికారం, అంగ బలలాతో రాజేంద్రప్రసాద్ ను ఓడించేందుకు శతథా ప్రయత్నించింది. హేమా, కొందరు కళాకారులైతే డబ్బు కోసమే రాజేంద్రప్రసాద్ నాటాకాలడుతున్నారని మీడియా సాక్షిగా ధ్వజమెత్తారు. మురళీ మోహన్ తదితరులు రాజేంద్రప్రసాద్ తరఫున నిలబడ్డ వ్యక్తులను బెదిరించి పోటీ నుంచి విరమింపచేశారు. ఎన్నికల్లో సెల్ ఫోన్లు, వెయ్యి రూపాయల నోట్లు పంచారు.

కానీ అవన్నీ పంచినా కూడా మురళీమోహన్, జయసుధను కళాకారులు గెలిపించలేదు. నీతిగా, నిజాయితీగా సేవ చేస్తానన్న రాజేంద్రప్రసాద్ కే పట్టం కట్టారు. రాజేంద్రప్రసాద్ కూడా అందరూ తనపై ఒత్తిడి తెచ్చినా.. మెగా బ్రదర్ నాగేంద్రబాబు అండగా నిలిచారని ఆయన బలంతో తాను విజయం సాధించానని గెలిచాక చెప్పడం గమనార్హం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *