మెక్ కల్లమ్ ను ఫిక్సింగ్ చేయమన్నాడట..

న్యూజిలాండ్ కెప్టెన్ మెక్ కల్లమ్ ఫిక్సింగ్ పై బాంబు పేల్చాడు.. తన మాజీ సహచర ఆటగాడు క్రిస్ కెయిన్్ 2008 ఏప్రిల్ లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఫిక్సింగ్ చేయాలని కోల్ కతాలోని ఓ హోటల్ లో కలిసినప్పుడు తనను కోరాడని.. కానీ తాను ఒప్పుకోలేదని అన్నారు. లండన్ కోర్టులో ఫిక్సింగ్ పై జరుగుతున్న విచారణకు హాజరైన మెక్ కల్లమ్ ఈ బాంబు పేల్చాడు..

ఆ తర్వాతకూడా రెండు సార్లు ఫిక్సింగ్ చేయాలని కోరాడని.. కానీ తాను ఒప్పుకోలేదన్నారు. ఒక్కో స్పాట్ ఫిక్సింగ్ కు 70వేల నుంచి 2 లక్షల డాలర్ల వరకు ఇస్తారని ఆశపెట్టారని వెల్లడించారు. ఫిక్సింగ్ సొమ్ముతో కెయిన్స్ న్యూజిలాండ్ లో ఆస్తులు కూడబెట్టాడని తెలిపారు. కెయిన్స్ 2011లో పోలీసులకు చిక్కి విచారణ ఎదుర్కొంటున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *