
నిన్న అనంతపురంలో గ్రానైట్ లారీ రైలును ఢీకొన్న ప్రమాదంలో కర్ణాటక ఎమ్మెల్యేతో పాటు పదుల సంఖ్యలో మరణించారు. అక్కడికి సీన్ కట్ చేస్తే.. ప్రమాదానికి కారణమైన భారీ గ్రానైట్ బండకు ఇవాళ అదే ప్రమాద సంఘటన జరిగిన ప్రదేశంలో పూజలు జరగడం కలకలం రేగుతోంది..
గుర్తు తెలియని వ్యక్తులు ఆ మృత్యుబండపై పసుపు, కుంకుమ వేసి పూజలు చేశారు. నిమ్మకాయలు, కొబ్బరికాయలు ఉండడంతో స్తానికులు భయాందోళనలకు లోనవుతున్నారు.
కాగా గ్రానైట్ బండను తరలించాలనే ఉద్దేశంతోనే గ్రానైట్ వ్యాపారులు ఇలా చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వ్యతిరేకత రావద్దనే వ్యాపారులు ఇలా నాటకమడుతున్నారన్నారు.