మూసీ, దిండి, ఉదయ సముద్రం, పనులపై మంత్రి హరీశ్ రావు సుదీర్ఘ సమీక్ష

మూసీ ద్వారా వానాకాల పంటకు నీరందిస్తాం… మంత్రి హరీశ్ రావు

దిండి ప్రాజెక్టు కింద చెరువులు నింపి నీళ్లిచ్చేలా చర్యలు తీసుకోండి

మూసీ, దిండి, ఉదయ సముద్రం. ఎ. ఎం.ఆర్. ఎస్.ఎల్. బీ. సీ పనులపై మంత్రి హరీశ్ రావు సుదీర్ఘ సమీక్ష.

మూసీ ద్వారా ఈ వానాకాల పంటకు నీరివ్వనున్నట్లు భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. మూసీ ప్రాజెక్టు కింద 25 వేల ఎకరాల వానాకాల పంటకు నీరిస్తామన్నారు. ఇందుకు తగిన ప్రణాళికలు సిద్దం చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. ఇవాళ ఆయన మూసీ ప్రాజెక్టు, ప్రాజెక్టు కింది కాలువలు, దిండి, ఉదయ సముద్రం ప్రాజెక్టు పనుల పురోగతిపై జల సౌధలో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. మూసీలో ప్రస్తుతం 2.64 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, ఆన్ ఆఫ్ పద్ధతిలో రైతులకు నీరు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో పాటు ధర్మారెడ్డి పల్లి కెనాల్ పనులను మంత్రి సమీక్ష నిర్వహించారు. 51.5 కిలోమీటర్ల కాలువ పనులకు గాను 21 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని, మిగతా పని పూర్తి చేయాల్సి ఉందని ఇంజనీర్లు మంత్రికి తెలిపారు. మిగతా పనులు భూసేకరణ కారణంగా ఆపాల్సి వచ్చిందని చెప్పడంతో మంత్రి హరీశ్ రావు భూసేకరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఏదైనా సమస్య వస్తే వెంటనే తన దృష్టి తేవాలని సూచించారు. కాలువల పై ఉన్న నిర్మాణాల పనులు పది శాతం పూర్తియినట్లు ఇంజనీర్లు తెలిపారు. పిల్లాయి పల్లి కాలువ పనుల పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. 66 కిలోమీటర్ల కాలువ పనులకు గాను, 23.58 కిలోమీటర్ల పనులు పూర్తయినట్లు ఇంజనీర్లు తెలిపారు. 42.41 కిలోమీటర్ల కాలువ పరిధిలో భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. ఆ పనులు వెంటనే చేపట్టి భూసేకరణ సమస్యలను పరిష్కరించాలని మంత్రి వారికి సూచించారు. బునాది గాని కాలువ పనులపైన మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ కాలువ పనులను వేగంగా చేయాలని, భూసేకరణ పనులు వేగవంతం చేయాలన్నారు. భూసేరణ సమస్యలపై జిల్లా కలెక్టర్ తో మాట్లాడతానని మంత్రి హరీశ్ రావు చెప్పారు.

దిండి తొలి ఫలితం డిసెంబర్ లో ప్రజలకు అందేలా చూడాలి… మంత్రి హరీశ్ రావు.

దిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, రిజర్వాయర్లు, కాలువ పనులపై ప్యాకేజీల వారీగా మంత్రి హరీష్ రావు సమీక్ష జరిపారు. ప్యాకెజీ -1 లో భాగమయిన సింగరాజు పల్లి, ప్యాకేజీ – 3 లో భాగమయిన గొట్టి ముక్కల రిజర్వాయర్ పనుల వేగంగా పూర్తి చేసి డిసెంబర్ లో దిండి ప్రాజెక్టు ద్వారా తొలి ఫలితం ప్రజలకు అందేలా చూడాలని ప్రాజెక్టు ఇంజనీర్లను ఆదేశించారు. ప్యాకేజీ -1 లో రిజర్వాయర్ పనులు 70 శాతం పూర్తయ్యాయని, మిగతా పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్యాకేజీ-ొ 1లో విద్యుత్ టవర్లు ఉన్నాయని, వాటిని మార్చే విషయమై ట్రాన్స్ కో తో సంప్రదింపులు జరుపుతున్నట్లు అధికారులు చెప్పగా…ఆ పనులు వేగవంతం చేయాలని సూచించారు. ఈ విషయమై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు, అధికారులతోను స్వయంగా మాట్లాడతానని మంత్రి చెప్పారు. విద్యుత్ టవర్ల విషయంలో ఇంకా ఏదైనా సమస్య ఉంటే లిఫ్ట్స్ సలహాదారు పెంటారెడ్డితో చర్చించాలని ఇంజనీర్లకు మంత్రి సూచించారు. డిసెంబర్ లోగా రిజర్వాయర్ నిర్మాణ పనులన్నీ పూర్తి చేసి ప్రజలు నీరివ్వాలని ఆదేశించారు. అదే రీతిలో గొట్టి ముక్కల రిజర్వాయర్ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. ఈ రిజర్వాయర్ పనులు దాదాపు60 శాతం పూర్తయినట్లు ఇంజనీర్లు సమీక్షలో చెప్పారు.ఈ రిజర్వాయర్ పరిధిలో 65 ఇళ్లకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని ఇందుకు 18 కోట్ల నిధులు విడుదల చేయాలని మంత్రిని కోరారు. ఇందుకు వెంటనే నిధులు విడుదల చేస్తామని చెప్పారు. స్పిల్ వే, కాంక్రీట్ పనుల వేగం పెంచాలని ఇంజనీర్లను ఆదేశించారు. చింతపల్లి రిజర్యాయర్ పనుల పైన మంత్రి సమీక్ష జరిపారు. ఈ రిజర్వాయర్ పనులు భూసేకరణ కారణంగా కొంత జాప్యం అవుతుందని మంత్రి దృష్టికి తెచ్చారు. 15 వేల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే ఈ రిజర్వాయర్ నిర్మాణానికి 1700 ఎకరాలు సేకరించాల్సి ఉండగా ఇప్పటికే 500 ఎకరాలు సేకరించినట్లు చెప్పారు. భూసేకరణ సమస్యలపై జిల్లా కలెక్టర్ తోను చర్చించి పరిష్కరిద్దామన్నారు. చింతపల్లి రిజర్వాయర్ కిందే కొత్తగా పదివేల ఎకరాలకు, ఇర్విన్ రిజర్వాయర్ ద్వారా నీరు ఇచ్చేందుకు నిర్మిస్తున్నామని ..ఈ రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ రిజర్వాయర్ పరిధిలో మరో 300 ఎకరాల భూసేకరణ జరపాలని, ఈ భూసేకరణ పనులపై దృష్టి సారించాలన్నారు. దిండి ప్యాకేజీ- 4, ప్యాకేజీ-5, ప్యాకేజీ-6 పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్యాకేజీల్లో భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. అటవీ భూముల ఉన్న చోట ఆ శాఖ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి పనులు వేగవంతం చేయాలన్నారు. ప్యాకేజీ – 7లో శివన్న గూడెం రిజర్వాయర్ పనులను సమీక్షించిన మంత్రి హరీశ్ రావు పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. 40 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులకు గాను, 3 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తయిందని రీచ్ – 3లో బత్తాయి తోటలు ఉన్న కారణంగా పనుల్లో కొంత జాప్యం ఉందని అధికారులు చెప్పగా, ఆ భూముల సేకరణపై దృష్టి సారించాలన్నారు. రీచ్ – 3లో 50 శాతం పనులు పూర్తయిందని అధికారులు చెప్పారు. ఈ ప్యాకేజీ పనుల్లో జాప్యం లేకుండా చూడాలని, గుత్తేదారులను పిలిపించి మాట్లాడాలని ప్రాజెక్టు ఇంజనీర్లను మంత్రి ఆదేశించారు.

ఉదయ సముద్రం ప్రాజెక్టు పనుల వేగం పెంచండి- మంత్రి హరీశ్ రావు.

ఉదయం సముద్రం ప్రాజెక్టు పనుల వేగం పెంచాలని మంత్రి హరీశ్ రావు ప్రాజెక్టు ఇంజనీర్లను ఆదేశించారు. పనులు ఆలస్యంగా చేసే గుత్తేదారులపై అవసరం అయితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గుత్తే దారుల అలసత్వం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా ఉంటే సహించేది లేదన్నారు. ప్యాకేజీ -7లో లూజు మట్టి వల్ల టన్నెల్ పనుల్లో జాప్యం జరుగుతున్నట్లు ప్రాజెక్టు ఇంజనీర్లు మంత్రికి తెలిపారు. కాళేశ్వరం పనుల్లో ఇలాంటి సమస్యను పరిష్కరించేందుకు సిమ్లా నుంచి వచ్చిన టన్నెల్ నిపుణుడు వి.కే చౌహాన్ సలహా, సూచనలు తీసుకోవడం తోపాటు, ఆయన్ను పిలిపించుకోవాలన్నారు. 356 మీటర్ల వరకు లూజ్ మట్టి ఉన్న చోట పనులు పూర్తి చేశామని, మరో 138 మీటర్ల పనులు చేయాల్సి ఉందన్నారు. ఈ ప్రాజెెక్టు పరిధిలోని కాలువలకు లైనింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కాలువల పరిధిలో ఇంకా 19 ఎకరాల భూమి సేకరించాల్సి ఉందని, ఆ పనులు పూర్తి చేయాలన్నారు. కాలువలపై స్ట్రక్చర్లు, పంప్ హౌస్ పనులు వేగవంతం చేయాలన్నారు. హెడ్ రెగ్యులైటర్ పనుల పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ పనులు ముగింపు దశలో ఉన్నట్లు ఇంజనీర్లు తెలిపారు.

ఎస్.ఎల్. బి.సీ టన్నెల్ పనులపై సమీక్ష.

ఎస్.ఎల్. బి. సీ టన్నెల్ పనులపైన మంత్రి హరీష్ రావు సమీక్ష జరిపారు. టన్నెల్ 43.93 కిలోమీటర్లకు గాను, 32.37 కిలోమీటర్ల వరకు పనులు పూర్తి చేసినట్లు ఇంజనీర్లు తెలిపారు. మిగతా 11.56 కిలోమీటర్ల పని మిగిలి ఉందని ఆ పనులు వేగవంతం చేయాలన్నారు. టన్నెల్ లో పని చేసే యంత్రం బేరింగ్ పాడయిందని, దీన్ని తెప్పించేందుకు 50 కోట్ల రూపాయల అడ్వాన్స్ కావాలని గుత్తేదారులు మంత్రిని కోరారు. దీనిపై ప్రభుత్వం పరిశీలిస్తుందని.. సానుకూలంగా్ నిర్ణయం తీసుకుంటామని మంత్రి గుత్తేదారులకు హామీ ఇచ్చారు. టన్నెల్ 1, టన్నెల్ -2 మధ్య లింక్ కెనాల్ పనులు పూర్తయ్యాయని ఇంజనీర్లు మంత్రికి తెలిపారు. ఎస్.ఎల్. బీసీ లో అంతర్భాగమైన పెండ్లి పాక రిజర్వాయర్ పనులపైన మంత్రి సమీక్ష జరిపారు. కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కాలువ 24 కిలోమీటర్లకు గాను 14.75 కిలోమీర్ల వరకు భూసేకరణ పూర్తయిందని ఇంజనీర్లు మంత్రికి తెలిపారు. భూసేకరణ పనులు వేగవంతం చేయాలన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *