మూడు ప్రేమలు.. ఆరు లేచిపోవడాలు..

– మా ఊళ్లో సంక్రాంతిలో ముచ్చట్లు..
కరీంనగర్, ప్రతినిధి : టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్లు, టీవీలు, మీడియా ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉందంటే ఏమో అనుకున్నా.. కానీ సంక్రాంతికి ఊరెళితే కానీ తెలియలేదు.. పదేళ్ల కిందటితో పోలిస్తే ఇంతలా మారిందని.. మారుతుందని అనుకోలేదు.. గిర్రున తిరిగిన కాలం.. ఆధునిక సాంకేతిక నేటి యువతను, విద్యార్థులను నిజంగానే చెడగొట్టింది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. సంక్రాంతికి ఊరెళితే ఊళ్లో ఓ రౌండ్ వేసి వచ్చేసరికి నాకు తలబొప్పి కట్టింది.. మా ఇంటికి దగ్గర్లొని తొమ్మిదో తరగతి అమ్మాయి ఎవరో ఆటో వాడితో వెళ్లిపోయిందట.. మా దగ్గరి బంధువు కుమారుడు ఓ అమ్మాయికి లవ్ లెటర్ రాసి దొరికితే కొట్టాడట.. గ్రామంలో ఈ ఆరు నెలల్లో ఆరు జంటలు లేచిపోయాయి.. కులాలు.. మతాలు లేవు గ్రామంలో.. ఎవరికి నచ్చినవాళ్లు వారితో వెళ్లిపోయారు. వారంతా మేజర్లు అనుకుంటే పొరపాటే.. అంతా మైనర్లు. 20 ఏళ్లలోపు వారే.. తెలిసి తెలియన ఏజ్.. ప్రేమ వ్యామోహంతో తల్లిదండ్రులను వదిలి లేచిపోయారు. నిజంగా ఊళ్లో విషయాలు తెలిసి బాధేసింది.  వీరే కాదు.. మా జూనియర్ ఒకతను ఎంసీఏ కంప్లీట్ చేసి ఊళ్లో ఉంటున్నాడు.. వాడు ఒక అమ్మాయిని ప్రేమించి ఇంట్లోంచి పారిపోతూ తల్లిదండ్రులకు దొరికిపోయాడు. ఆ పిల్లనే చేసుకుంటానని వాడు.. కాదు ఆమె తక్కువ కులం వద్దంటూ వాళ్లు.. పంచాయతీ నా దగ్గరకు వస్తే ఎం చెప్పాలో.. ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియలేదు నాకు.. ఇది ప్రేమ.. ఆకర్షణ కూడా తెలియని పిల్లలు.. ఇలా లేచిపోవడాలు.. ప్రేమలు..వాళ్ల తల్లిదండ్రుల గొడవలు ఇవీ మా ఊళ్లో కనిపించాయి..

మా ఊరేదనుకుంటున్నారా.. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట..  నా పదోతరగతి రోజుల్లో అమ్మాయిలతో మాట్లాడాలంటే కొంచెం భయమేసింది. అప్పటి టీచర్లు మా స్ట్రిక్ట్ గా పాఠాలు చెప్పేవారు.  అబ్బాయిలు అమ్మాయిల్ని కన్నెత్తి చూశావారు కాదు.. ఇది భయం వల్ల వచ్చింది కాదు.. అప్పటి సంప్రాదాయాలు.. పోకడలు ఇంతలా ఫాస్ట్ గా లేవు. కానీ ఇప్పడు తొమ్మిది తరగతి ఆడపిల్లలు గ్రామంలో ఇద్దరు లేచిపోయారు. పదోతరగతి లోపే ప్రేమలు కవితలు.. ఇక ఇంటర్, డిగ్రీ విద్యార్థులను కనీసం టచ్ చేయడానికి లేదు.. ఇదంతా ఎలా వచ్చిందంటే అంతా స్మార్ట్  ఫోన్లు.. మీడియా.. ప్రపంచీకరణ .. ఇవే సమాజంలో మార్పు తీసుకొచ్చాయి.. నేటి యువతను, విద్యార్థులను చెడగొట్టాయి.. వాటిని మార్చే పరిస్థితి ప్రస్తుతానికైతే లేదు.. కానీ పిల్లల్ని చెడు దారికిపోకుండా ఓ కంట కనిపెట్టుకుంటూ ఉండడమే మన ముందు ఉన్న ప్రథమ కర్తవ్యం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.