మూడు పదులు దాటాయి.. 30కోట్లు వస్తున్నాయి..

బాహుబలి మూడేళ్ల కష్టం.. ప్రభాస్ హీరోగా రాజమౌళి చెక్కిన ఓ అద్భత తెలుగు శిల్పం.. జాతీయ అంతర్జాతీయంగా పేరొందిన ఈ సినిమా 500 కోట్లకు పైగా వసూళ్లు చేసి.. విదేశాల్లో అనువాదం అవుతూ ఇంకా వసూళ్లు చేస్తూనే ఉంటుంది.. మామూలగా ఏ హీరోకూడా 3 ఏళ్లు ఒక సినిమా కోసం మరో సినిమా చేయకుండా ఉండలేడు.. కానీ జక్కన్న రాజమౌళిని నమ్మి ఆరడుగుల అందం ప్రభాస్ మూడేళ్లు బాహుబలిని నమ్ముకున్నాడు… మూడు పదులు దాటినా పెళ్లి చేసుకోకుండా బాహుబలికి అంకితమయ్యాడు..

దాదాపు 35 ఏళ్లు దగ్గర పడుతున్న ప్రభాస్ కు పెళ్లి చేయాలని పెదనాన్న కృష్ణంరాజు, కుటుంబ సభ్యులు బాహుబలి విడుదల తర్వాత ప్లాన్ చేశారట.. కానీ ఈ హీరో బాహుబలి 2 తర్వాత పెళ్లి చేసుకుంటానని చేప్పాడట.. ఇదంతా జక్కన్న ఐడియాలజీయో లేక బాహుబలి 2 ఏకాగ్రత కోసమో తెలియదు కానీ ప్రభాస్ పెళ్లి క్యాన్సల్ చేసుకుంది బాహుబలి 2 కోసం అన్నది వాస్తవం..

ఏదైతేనేమీ సంవత్సరానికి ఒక సినిమా చేస్తే ప్రభాస్ కు వచ్చేది దాదాపు 5 నుంచి 6 కోట్లు కానీ 3 ఏళ్లు ఏ సినిమా చేయకుండా బాహుబలికోసం పనిచేసిన ప్రభాస్ కు తమిళ రైట్స్ 19 కోట్లతో పాటు హిట్ అయిన తర్వాత మరో 15 కోట్లు ఇచ్చారట.. అంటే మూడు పదుల వయసులో 35 కోట్ల దాకా సంపాందించాడు ప్రభాస్.. ఇక బాహుబలి 2 సినిమా కోసం 50 కోట్ల వరకు ప్రభాస్ కు పారితోషకం రెడీ చేసి పెట్టారట నిర్మాతలు.. అందుకే పెళ్లి గిల్లి జాన్తా నై అని బాహుబలి 2 కోసం కసరత్తులు చేస్తున్నాడు ఈ పేద్ద హీరో ఇప్పుడు…

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *