మూడు దశాబ్దాల తర్వాత అలుగు పారిన గణపసముద్రం

మూడు దశాబ్దాల తర్వాత అలుగు పారిన గణపసముద్రం

గొలుసుకట్టు చెరువులకు పూర్వవైభవం.

పొంగిన “గణపసముద్రం”.

“సప్త సముద్ర”కు పునర్జన్మ.

ఘనపురంలో నీటి ఊట.

పొలంలో ‘చెలిమె’.

వలస ప్రాంతంలో కృష్ణా గల గలలు.

నేలపైకి ఉబికిన  ‘పాతాళగంగ.’

నిన్నటివరకు మోడువారిన బోర్లు,మొండిమాను లా ఫీడర్ చానల్లు.

ఇప్పుడు అడగడుగునా నీళ్ళే.

వనపర్తిలో “మిషన్ కాకతీయ” మహత్యం.

పాలమూరు సీనురివర్స్.

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత “సముద్రం” పొంగి పొర్లింది. పెద్ద చెరువులను తెలంగాణ ప్రజలు “సముద్రం”గా పిలుచుకునే ఆనవాయితీ ఉన్నది.వనపర్తి జిల్లా “గణప సముద్రం”పొంగి పొర్లుతున్నది.ఈ చెరువు మిగతా చెరువుల వలె పొంగితే వింత కాదు.కానీ వందేళ్ళ లో మూడోసారి మత్తడి దుంకడమే గణపసముద్రం విశేషం.ఇప్పుడు ఫిబ్రవరిలో ఎండాకాలం ముఖద్వారం దగ్గర ఈ అద్భుతం ఆవిష్కృతమైంది.ఘనపురం మండలం పూర్వ పాలమూరు జిల్లాలో కరవు,దుర్భిక్షం,వలసలకు పేరు  మోసిన ప్రాంతం.”సప్తసముద్రాలు”న్నా చుక్క నీటిబొట్టుకు ఘనపురం అల్లాడిపోయింది.గత పాలకవర్గాల నిర్లక్ష్యం,అలసత్వం వల్ల గణపసముద్రం పూర్తిగా పూడుకుపోయింది.కల్వకుర్తి ప్రాజెక్టు నుంచి మొదటిసారి ఘనపురం బ్రాంచ్ కెనాల్ కు సాగునీటిని విడుదల చేయడంతో గణపసముద్రం అలుగుపారుతున్నది.మిషన్ కాకతీయ 2 దశ కింద గణప సముద్రం ఫీడర్ చానల్ మరమ్మతులు చేపట్టి, పూడిక తొలగించి దాన్ని పునరుద్ధరించడం వల్ల ఈ విజయం సాధ్యమైంది.కరెంటు, మోటార్లు లేకుండానే క్రష్ణా జలాలు పొలాల్లో ప్రవహిస్తున్నవి. చాలా కాలం తర్వాత,  నీటి కోసం చూసి చూసి కళ్ళు కాయలు కాసిన తర్వాత రైతుల కళ్ళ నుంచి మంగళవారం ఆనంద భాష్పాలు రాలినవి.గణపసముద్రం మత్తడి దుంకడం అనే విషయం రైతులు కలలో కూడా ఊహించనిదని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజనరెడ్డి అన్నారు.కల్వకుర్తి పనులను వేగంగా పూర్తి చేయడానికి రేయింబవళ్ళు కృషి చేస్తూ గణపురం  బ్రాంచ్ కెనాల్ కు నీటి విడులపై చొరవ తీసుకున్న ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావుకు నిరంజనరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.గణపసముద్రం చెరువు నిండడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలసంపద కూడా అనూహ్యంగా పెరిగింది.దీంతో గణపసముద్రం పరిసరాల్లో పాతాళగంగ ఉబికి వస్తున్నది.నీళ్ళు ఊటలా పెల్లుబుకుతున్నవి.నిన్న మొన్నటివరకు దాదపు 600 మీటర్లకు పైగా భూతల్లిని తోలచినా  బోర్లలో నీళ్ళు వచ్చేవి కాదు.గణపసముద్రం పరిసర ప్రాంతాలలోని దాదాపు 200 బోర్లు రీ చార్జ్ అయ్యాయి.గణపసముద్రం చెరువు దిగువ భాగాన ఉన్న ప్రాంతాల్లో 10 మీటర్లు తవ్వకుండానే  భూగర్భ జల సంపద లభిస్తున్నట్టు  గ్రౌండ్ వాటర్ డిపార్ట్  మెంటు అధికారులు తెలియజేశారు.వనపర్తి నియోజకవర్గంలో 2016 – 2017 లో 74 చెరువులను మిషన్ కాకతీయ మొదటి దశ కింద చేపట్టి కల్వకుర్తి లిఫ్ట్ ద్వారా నింపి  12, 399 ఎకరాలకు సాగునీరందించారు.2017 – 2018లో  246 చెరువులను మిషన్ కాకతీయ రెండో దశ కింద చేపట్టి 22,539 ఎకరాలకు సాగునీరందించారు.మిషన్ కాకతీయ కార్యక్రమం కారణంగానే చెరువులు నింపడం, చెరువులు నిండిన కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భజల సంపద పెరగడం తో ఘనపురం మండలంలో రైతాంగం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.వనపర్తిలోని రంగ సముద్రం, గోపాల సముద్రం,శంకరమ్మ సముద్రం, మహబూపాల సముద్రం, రాయసముద్రం, కృష్ణసముద్రం, వీరసముద్రం వంటి ఏడు సముద్రాలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 10 వేల ఎకరాలుకు సాగు నీరు అందేది. 600 ఎకరాలకు నీరు అందేలా కృష్ణసముద్రం చెరువును నిర్మించారు. కొత్తకోటలో ఉన్న ఈ చెరువును  బీమాలో చేర్చారు. బీమా నుండి వచ్చే నీటిని ముందుగా శంకర సముద్రంలో నింపి తర్వాత కృష్ణసముద్రాన్ని నింపుతారు. దీంతో సంకిరెడ్డిపల్లి, రాయనిపేట గ్రామాలతో పాటు 10 గ్రామాలకు తాగు, సాగు నీరందుతోంది. సప్తసముద్రాల్లో మరొకటి రంగ సముద్రం. ఇది పెబ్బేరు మండలంలోని శ్రీరంగాపూర్‌లో ఉంది. దీని ఆయకట్టు దాదాపు 3000 ఎకరాలకు సాగు నీరు అందించేది. వనపర్తి సంస్థానాదీశుల కాలంలో కొల్లాపూర్‌ సురభీ వంశస్తులు దీన్ని నిర్మించారు. కాగా ఈ చెరువును బీమాకు లింకు చేయడంతో 20 వేల ఎకరాలకు సాగునీరు, 15 గ్రామాలకు తాగునీరు అందుతోంది. కొత్తకోట మండలంలోని కానాయిపల్లి దగ్గర ఉండే శంకరసముద్రాన్ని 160 ఏళ్ల కిందట శంకరమ్మ పాలనలో నిర్మించారు.

ghanapuram samudram 3     ghanapuram samudram 1

ఈ చెరువు కింద 2,700 ఎకరాల ఆయకట్టు ఉంది. దీన్ని గతంలో జలయజ్ఞంలో భాగంగా బీమా ద్వారా నీరందేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం పనులు పూర్తైతే దాదాపు 40 వేల ఎకరాలకు సాగు నీరు అందే అవకాశాలు ఉన్నాయి. ఈ మూడు చెరువులు మినహా ఇస్తే మిగితా నాలుగు సముద్రాలు వాటి ఉనికిని కోల్పోతున్నాయి. వీరసముద్రం, రాయసముద్రం, మహబూపాల్‌ సముద్రం, గోపాల్‌ సముద్రాలు అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి. కొత్తకోట మండలం రాయణిపేట గ్రామం పక్కనే రాయసముద్రాన్ని వనపర్తి సంస్థానాదీశుల కాలంలో నిర్మించారు. ఈ చెరువు ద్వారా 1200 ఎకరాల ఆయకట్టుకు నీరందేది. గతంలో చెరువు నిర్వహణను నిర్లక్ష్యం చేసిన కారణంగా అది పూర్తిగా దెబ్బతిన్నది. మహబూపాల్‌ సముద్రం చెరువును వనపర్తి రాజు రాజారామేశ్వరరావు వంశీయులు నిర్మించారు. గతంలో 400 ఎకరాలకు నీరందేది. ప్రస్తుతం జూరాల నీటితో చెరువును నింపుతున్నారు. ఈ చెరువును పూర్తి స్థాయిలో నింపితే దాదాపు 10 వేల ఎకరాలకు సాగు నీరు అందే అవకాశాలు ఉన్నాయి. పెబ్బెరు మండలంలో వీర సముద్రం చెరువు ఉంది. ఈ చెరువు గతంలో వెయ్యి ఎకరాలకు సాగు నీరందించేది. అయితే నేడు వంద ఎకరాలకూ సాగు నీరందించలేని పరిస్థితిలో ఉంది. పెద్దమందడిలో ఉండే గోపాలసముద్రం వెయ్యి ఎకరాలకు సాగు నీరు అందేది. ఇప్పుడు కాల్వలు పూడుకుపోయి  శిఖం అన్యాక్రాంతం అయ్యింది. చెరువు నిండుగా ఉంటే, పొలం ప‌చ్చ‌గా ఉంటుంది. పొలం ప‌చ్చ‌గా ఉంటే బ‌తుకు బంగారుమవుతుంది. తెలంగాణ స‌ర్కార్ అవ‌లంబిస్తున్న పంథా కూడా ఇదే. తెలంగాణ స్వ‌రాష్ట్రంగా   ఏర్పడిన తర్వాత, రాజ‌రికంలో కొన‌సాగిన‌ప్పుడైనా  ఇక్క‌డ చెరువు నీటి మీద ఆధార‌ప‌డే వ్య‌వ‌సాయం జ‌రిగేది.  మ‌నుషులు, ప‌శుప‌క్ష్యాదుల  తాగునీటి అవస‌రాల‌ను కూడా ఆ చెరువే తీర్చేది.ఆంధ్ర‌ప్ర‌దేశ్  ఏర్ప‌డ‌క ముందు తెలంగాణ‌లో ఉన్న చెరువులు నిండుగా, రైతు గుండేకు ధైర్యంగా ఉండేవి. కానీ ఆ త‌ర్వాత తెలంగాణ చెరువులు స‌ర్వ నాశ‌నం అయినవి. ఒక్క చెరువు బాగుప‌డితే కొన్ని వంద‌ల బ‌తుకులు బాగుప‌డ‌తాయన్న అనుభవం పూర్వ పాలమూరు జిల్లాలో కన్పిస్తున్నది. ఆ చెరువు మీద ఆధార‌ప‌డి వ్య‌వ‌సాయం చేసే రైత‌న్న బాగుప‌డ‌తాడు. ఆ చెరువును న‌మ్ముకున్న ర‌జ‌క‌, బెస్త, ముదిరాజుల‌కు జీవ‌న బృతికి దొర‌కుతుంది. ప‌శు పక్ష్యాదులకు నీళ్లు, పంట పొలాలు బీళ్లుగా మార‌కుండా ఓ ఊరి చెరువు కాపాడుతుంది. ఒక ఊరి నుంచి మరో ఊరికి, ఒక చెరువునుంచి మరో చెరువుకి నీరు ప్రవహించే గొలుసు కట్టు చెరువుల నిర్మాణం కూడా తెలంగాణలో అనాదిగా ఉన్న వ్యవస్థ. ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న జ‌రుగుతున్న క్ర‌మంలోనే నాటి ఉద్య‌మ నేత,  ముఖ్యమంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావు తెలంగాణ‌కు మ‌ణిహార‌మైన గొలుసుక‌ట్టు చెరువుల‌ను అభివృద్దిప‌ర్చాల‌ని త‌ల‌పెట్టారు. స్వ‌రాష్ట్రంలో చెరువుల పున‌రుద్ద‌ర‌ణ చేస్తామ‌ని ముందుగానే ఆయన ప్రకటించారు.  ముఖ్య‌మంత్రి  ఒక విజ‌న్ తో, ధృడ దీక్షా,  ప‌ట్టుద‌ల‌తో ముందుకెళుతుండ‌టంతో, ఆ శాఖ మంత్రి హ‌రీష్ రావు  అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నారు. ఒక్కొక్క చెరువుకు ప్రాణం పోస్తూ, న‌డ్డి విరిగిపోయిన తెలంగాణ నీటిపారుద‌ల రంగాన్ని గాడిలో పెడుతున్నారు. ఏడాదికి 25 శాతం చెరువుల చొప్పున మిష‌న్ కాక‌తీయ కింద అభివృద్దిపరుస్తూ, నాలుగేళ్ల‌లో మొత్తం చెరువుల‌కు పూర్వవైభ‌వం తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  గొలుసుకట్టు చెరువులు అంటే  మొదటగా గుర్తొచ్చేది వనపర్తి నియోజకవర్గ పరిధిలో ఉండే సప్తసముద్రాలు. వనపర్తిని కేంద్రంగా చేసుకుని పరిపాలనను సాగించిన సంస్థానాల రాజులు ఈ చెరువులను నిర్మించారు. అంతటి ప్రాముఖ్యతను కలిగి ఉన్న ఈ చెరువులకు  గతంలో  ఆదరణ కరువైంది. ఈ చెరువులను చూసేవారు లేకపోవడంతో ఆయకట్టు పూర్తిగా బీడు భూములుగా మారింది. తూములుధ్వంసమయ్యాయి.వేలాది ఎకరాలకు నీరు అందించిన ఈసప్తసముద్రాలు గతంలో ఆయకట్టు రైతులకు సిరులు కురిపించేవి. మిషన్ కాకతీయ కార్యక్రమం తో పాటు పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నందున చెరువుల పరిధిలోని ఆయకట్టు రైతులు పంటలకు నీళ్లు  అందించే సంకల్పం నేరవేరుతున్నది.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఈ సముద్రాలకు మహర్ధశ వచ్చిందని రైతులు సంబరపడుతున్నారు.

ghanapuram samudram     ghanapuram samudram 4

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *