
ఢిల్లీ, ప్రతినిధి : సెన్సార్ బోర్డుకు.. కేంద్ర ప్రభుత్వానికి మధ్య వైరం ముదిరి పాకాన పడింది. కేంద్రం వైఖరికి నిరసనగా సెన్సార్ బోర్డ్ రాజీనామాలు ఆగడం లేదు. నిన్న సెన్సార్ బోర్డ్ చీఫ్ లీలా శాంసన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. తాజాగా 9 మంది సెన్సార్ బోర్డు సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
వీళ్ల రాజీనామాకు ‘మెసెంజర్ ఆఫ్ గాడ్’ మూవీ ప్రధాన కారణంగా మారింది. మూవీకి క్లియరెన్స్ ఇచ్చే విషయమై సెన్సార్ బోర్డుకు, సెంట్రల్ గవర్నమెంట్ కు మధ్య విభేదాలు వచ్చినట్లు సమాచారం. మూవీకి పర్మిషన్ కు సంబంధించి సెన్సార్ సభ్యులపై తీవ్రమైన ఒత్తిడి వచ్చిందనే ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా రిజైన్ చేసిన సెన్సార్ సభ్యులు. బోర్డు వ్యవహారంలో ప్రభుత్వ జోక్యం పెరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకూ 23 మంది సభ్యుల్లో 11 మంది రాజీనామా చేశారు.