
సీఎం కేసీఆర్ తన దత్తత గ్రామమైన కరీంనగర్ జిల్లా ముల్కనూర్ లో పర్యటించారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గ్రామసభలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించారు. అనంతరం ఊరంతా కలియతిరిగారు. చివరగా గ్రామస్థులందరితో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.