ముమ్మ‌రంగా ల‌క్ష డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం

ట్రాన్స్‌ఫార్మింగ్ అర్భ‌న్ ల్యాండ్ స్కేపింగ్ అంశంపై స‌ద‌స్సులో క‌మిష‌న‌ర్ ప‌వర్‌పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌

జీహెచ్ఎంసీ ప‌రిధిలో నిరుపేద‌లకు ఉచితంగా డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లను ఇవ్వ‌డానికి 109 ప్రాంతాల్లో ల‌క్ష డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మిస్తున్న‌ట్టు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి పేర్కొన్నారు. నేడు ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ల‌క్నో న‌గ‌రంలో ప్రారంభ‌మైన ట్రాన్స్‌ఫార్మింగ్ అర్భ‌న్ ల్యాండ్ స్కేపింగ్ అనే అంశంపై రెండు రోజుల స‌ద‌స్సులో డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంపై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా వివ‌రించారు. న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ కూడా ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు ల‌క్ష‌ల ఇళ్ల‌ను నిర్మిస్తుండగా కేవ‌లం హైద‌రాబాద్ న‌గ‌రంలో ల‌క్ష డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల‌ను 9వేల కోట్ల‌కు పైగా వ్య‌యంతో నిర్మిస్తున్న‌ట్టు తెలిపారు. వీటిలో అత్యంత సంక్లిష్టంగా 37 బ‌స్తీల్లో ఉన్న ఇరుకు ఇళ్లు, గుడిసెలను తొల‌గించి డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల‌ను నిర్మిస్తున్నామ‌ని పేర్కొన్నారు. మొత్తం 5,60,00,000 చ‌ద‌రపు అడుగుల విస్తీర్ణంలో డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు కొన‌సాగుతున్నాయ‌ని, వీటి ద్వారా భ‌వ‌న నిర్మాణ రంగ ఆధారిత ప‌రిశ్ర‌మ‌ల‌కు, వేలాది మంది కార్మికుల‌కు ప్ర‌త్య‌క్షంగా ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తున్నాయ‌ని పేర్కొన్నారు. డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో అత్యంత ఆధునిక‌మైన షీయ‌ర్ వాల్ టెక్నాల‌జిని ఉప‌యోగిస్తున్నామ‌ని తెలిపారు. కొల్లూరు, రాంప‌ల్లి, అహ్మ‌ద్‌గూడ త‌దిత‌ర ప్రాంతాల్లో ఒకే స్థ‌లంలో 5వేల నుండి 16వేల డబుల్ బెడ్‌రూం ఇళ్ల‌ను నిర్మిస్తున్నామ‌ని, వీటి పూర్తితో ఆయా ప్రాంతాల్లో ప్ర‌త్యేకంగా మున్సిపాలిటీల‌కు త‌గ్గ టౌన్‌షిప్‌లు ఏర్ప‌డ‌నున్నాయ‌ని పేర్కొన్నారు. ఈ ఇళ్ల నిర్మాణాల‌ను వివిధ శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో చేప‌డుతున్నామ‌ని పేర్కొన్నారు. ఇన్‌సీటు గృహ‌నిర్మాణానికి గాను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కమైన‌  ప్ర‌ధాన మంత్రి ఎక్స‌లెన్సీ అవార్డు కూడా త‌మ‌కు ల‌భించింద‌ని డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి గుర్తుచేశారు. ఈ సంవ‌త్స‌రంతానికి 40వేల డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లు, వ‌చ్చే సంవ‌త్స‌రం జూన్ మాసాంతానికి మొత్తం ఇళ్లు పూర్త‌వుతాయ‌ని క‌మిష‌న‌ర్ వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో అహ్మ‌ద్‌గూడ‌ నిర్మిస్తున్న అతిపెద్ద డ‌బుల్ బెడ్‌రూం హౌసింగ్ కాల‌నీ 3డి న‌మూనాల‌ను ప్ర‌ద‌ర్శించ‌గా స‌మావేశానికి హాజ‌రైన‌వారు ఆస‌క్తితో ప‌రిశీలించారు. ఈ స‌మావేశంలో చీఫ్ ఇంజ‌నీర్ సురేష్ కూడా పాల్గొన్నారు.

B. JANARDAN REDDY     DOUBLE BED ROOM HOUSE PRESENTATION     DOUBLE BED ROOM HOUSE PLAN

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *