మున్సిప‌ల్ శాఖ ద్వారా 3.60 కోట్ల మొక్క‌లు నాటుతున్నాం : అర్వింద్‌కుమార్‌

 
 రాష్ట్రంలో 3.60 కోట్ల మొక్క‌ల‌ను మున్సిప‌ల్ శాఖ ఆధ్వ‌ర్యంలో నాటుతున్న‌ట్లు రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అర్వింద్ కుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఖైర‌తాబాద్ జోన‌ల్ కార్యాల‌యంలో నేడు హ‌రిత‌హారంలో భాగంగా క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డితో క‌లిసి మొక్కలు నాటారు. ఈ సంద‌ర్భంగా అర్వింద్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో హరిత‌హారంలో భాగంగా కేవ‌లం మున్సిప‌ల్ శాఖ ద్వారానే 3.60 కోట్ల మొక్క‌లు నాటాల‌నే ల‌క్ష్యంలో విస్తృతంగా మొక్క‌లు నాటుతున్న‌ట్లు తెలిపారు. వీటితోపాటు త‌మ ఇళ్ల‌లో నాట‌డానికి ఉచితంగా మొక్క‌ల‌ను పంపిణీ చేస్తున్నామ‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా జోన‌ల్ క‌మిష‌న‌ర్ భారతిహోలీకేరి, డిప్యూటి క‌మిష‌న‌ర్లు శ్రీ‌నివాస‌రావు, గీతారాధిక‌, సేవా, కృష్ణ‌శేఖ‌ర్‌, తిప్ప‌ర్తి యాద‌య్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *