మున్సిపాల్టీల్లో ఇక ఎల్ఈడీ వెలుగులు

తెలంగాణలోని మున్సిపాల్టీల్లో వీధిదీపాలకు ఇక ఎల్ ఈడీ వెలుగులు ప్రసరించనున్నాయి.. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం, ఎల్ ఈడీల సరఫరా సంస్థ ఈఈఎస్ఎల్ తో ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో 11 మున్సిపాల్టీల్లో పూర్తిగా ఎల్ ఈడీ బల్బులు ఈ పథకంలో అమర్చనున్నారు.

మొదట ఖమ్మం, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్ నగరపాలకలు, గజ్వేల్, మహబూబ్ నగర్, సిరిసిల్ల,తాండూర్, మంచిర్యాల,నల్గొండ, సిద్దిపేటల్లో వీధిదీపాలన్నింటికి ఎల్ ఈడీలు అమర్చుతారు. దీనివల్ల విద్యుత్ వినియోగం 50శాతం తగ్గుతుంది. ఈ తగ్గిన విద్యుత్ బిల్లుల ధరను సంస్థ ఈఈఎస్ఎల్ కు మున్సిపాల్టీలు ప్రతీ సంవత్సరం చెల్లించారు.

ఏడేళ్ల పాటు వీధిదీపాల నిర్వహణను ఈఈఎస్ఎల్ చూసుకుంటుంది. ఇప్పుడున్న పాత వీధిదీపాలను తొలగించి కొత్తవాటిని సంస్థ అమర్చుతుంది. ప్రభుత్వం ఆ తరువాత హైదరాబాద్ లోని ఇళ్లకు కూడా ఎల్ఈడీలు సరఫరా చేసేందుకు ఒప్పందం చేసుకుంటుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *