Breaking News

మున్సిపల్ శాఖ విభాగాధిపతులతో మంత్రి కెటి రామారావు సమీక్ష

మున్సిపల్ శాఖ విభాగాధిపతులతో మంత్రి కెటి రామారావు సమీక్ష

మున్సిపల్ శాఖ విభాగాధిపతులతో మంత్రి కెటి రామారావు ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖాపరంగా జరుతున్న పలు కార్యక్రమాలను సమీక్షించారు. ముఖ్యంగా 2018 -19 సంవత్సరానికి సంబందించి సమర్పించాల్సిన బడ్జెట్ పద్దులపైన విబాగాల వారీగా వివరాలు తెలుసుకున్నారు. వచ్చే రానున్న సంవత్సరంలో చేపట్టనున్న ప్రాజెక్టులు మరియు ప్రస్తుతం చేపడతున్న కార్యక్రమాలకు అవసరం అయిన అంచానాల రూపకల్పనపైన చర్చించారు. రాష్ర్టంలో ఉన్న పురపాలికల్లో చేపట్టబోయే పనులపైన చర్చించారు. వీటికి అవసరం అయిన నిధుల అంచనాల వివరాలను తెలుసుకున్నారు. కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయితీల ఎర్పాటు ఈ సంవత్సరమే జరగనున్న నేపథ్యంలో వాటికి కావల్సిన నిధులను కూడా పరిగణలోకి తీసుకుని అంచనాలు అర్ధిక శాఖకు సమర్పించాలన్నారు. జలమండలి అద్వర్యంలో చేపడుతున్న కేశవాపురం ప్రాజెక్టు మరియు ఇతర ప్రాజెక్టులకు అవసరం అయిన నిధులపైన ప్రత్యేకంగా చర్చించారు. హెచ్ యండిఏ, జియచ్ యంసి, హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ పైన మంత్రి, విభాగాధికారుల నుంచి వివరాలు సేకరించారు. ఈ సమీక్షా సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్తో పాటు ఇతర విభాగాధిపతులు పాల్గోన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *