చారిత్రక కట్టడాల ప్రదేశాలలో ఆక్రమంగా వెలిసిన కట్టడాలను తొలగించాలి: కేటీఆర్

హోటల్ హరిత ప్లాజాలో ఆగా ఖాన్ ట్రస్ట్, టూరిజం, అర్కియాలజీ, మున్సిపల్ శాఖ, కల్చరల్ శాఖాధికారులతో మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో టూరిజం ,  కల్చరల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం, మున్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ పాల్గొన్నారు.నగరంలోని ప్రాచీన కట్టడాలను  ఐటి ని ఉపయోగించుకొని చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోవాలని మంత్రి కేటిఆర్ ఆదికారులను ఆదేశించారు. కుతుబ్ షాహీ టూంబ్స్ ను యునేస్కో గుర్తింపు కు ప్రతిపాదన చేసేందుకు ఆవసరమైన యాక్షన్ ప్లాన్ పై  ఈ సమావేశంలో చర్చించారు.

ప్రపంచ వారసత్వ కట్టడాలలో యూనేస్కో గుర్తింపు లబించే కట్టడాలలో టాప్ 10 లో ఉన్న గోల్కోండ కోట, చార్మినార్, కుతుబ్ షాహీ చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఈ కట్టడాలను పరిరక్షించేందుకు ఆవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. చారిత్రక కట్టడాల ప్రదేశాలలో ఆక్రమంగా వెలిసిన కట్టడాలను తొలగించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. చారిత్రక కట్టడాల వద్ద కబ్జాలను అరికట్టేందుకు, అక్రమ భవనాలను తొలగించేందుకు ప్రత్యేక టాస్క్ పోర్సు ఏర్పాటు చేయాలని మంత్రి కెటిఆర్ ఆధికారులను ఆదేశించారు.

డిజిటల్ హెరిటేజ్ ప్రాజేక్టు లో భాగంగా చారిత్రక కట్టడాలను వాటి పరిరక్షణకు ముందుకు తీసుకేళ్లటానికి ప్రభుత్వానికి తగు ప్రతిపాదనలను సిద్దం చేయాలని మంత్రి కెటిఆర్ అధికారులను కోరారు.ప్రతి కట్టడం, ప్రాంతం జీయో ట్యాగ్, జియో పెన్సింగ్ చేయాలని మంత్రి అదేశించారు. ప్రదేశాలలో కూడిన యాప్  తయారీ చేయాలని మంత్రి ఆదికారులకు సూచించారు.

చార్మినార్, గొల్కొండ, కుతుబ్ షాహీ కట్టడాలకు యూనెస్కో హోధా కోసం ప్రభుత్వం అన్ని  విధాలుగా ప్రయత్నిస్తుందన్నారు  మంత్రి కెటిఆర్.ఆందుకు ఆవసరమైన ప్రతిపాదనలను రూపోందించుకోవాలన్నారు. హెచ్ ఎం డి ఎ , మున్సిపల్ , రెవిన్యూ . పోలిస్ శాఖలతో టాస్క్ పోర్స్ ఏర్పాటు చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. వచ్చే సమావేశం మార్చి నెలాఖరులోగా నిర్వహించాలని మంత్రి కెటిఆర్ ఆదికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్కియాలజీ సంచాలకురాలు విశాలక్షి , శిల్పారామం స్పేషల్  ఆపీసర్ కిషన్ రావు, ఆగాఖాన్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గోన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *