ముద్రా లోన్ మేళా నిర్వహణకు పకడ్భందీ ఏర్పాట్లు

  • కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్టోబర్ 7 న పీపుల్స్ ప్లాజాలో నిర్వహించే ఫైనాన్సియల్ ఇంక్లూజన్ క్యాంప్ ముద్రాలోన్ మేళా నిర్వహణకు పకడ్భందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.పి.సింగ్ సంబందిత అధికారులను ఆదేశించారు. ఈ విషయమై మంగళవారం బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులతో సి.ఎస్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు.
    ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ కె.రామకృష్ణారావు, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ జయేష్ రంజన్, ఆర్ధిక శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, స్టేట్ ట్యాక్స్ కమీషనర్ శ్రీ అనిల్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్రీమతి యోగితారాణా, జిహెచ్ఎంసి కమీషనర్ శ్రీ జనార్ధన్ రెడ్డి, సెర్ఫ్ సిఈఓ పౌసమి బసు, బ్యాంక్ అధికారులు జనరల్ మేనెజర్ నాబార్డ్ శ్రీ పి.న్ సత్యప్రసాద్, జనరల్ మేనెజర్ కెనరాబ్యాంక్ శ్రీ జి.ఆర్.రెడ్డి, సిజిఎం ఆంద్రాబ్యాంక్ శ్రీ వి.సత్యనారాయణ మూర్తి, జి.ఎం SLBC కన్వీనర్ శ్రీ యు.ఎన్ ఎన్ మాయ,ఐసిఐసిఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, SIDBI లు పాల్గొన్నారు.
    ఈ మేళా సందర్భంగా పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, ట్రేడర్స్, మర్చంట్స్ అసోషియేషన్స్ కు తగు సమాచారం, బ్యాంకు స్టాల్స్, SHG మహిళలకు సమాచారం భీమ్ ఆప్ వినియోగం తదితర అంశాలపై చర్చించారు ముద్రా రుణాల మంజూరును వేగవంతం చేయాలని బ్యాంకర్లను కోరారు. ముద్రా రుణాల మంజూరులో లోటు పాట్లు తొలగించి రాష్ట్రాన్ని మొదటి స్దానంలో నిలపటానికి కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో నగదురహిత లావాదేవిలలో ముందంజలో ఉన్నప్పటికీ తగినంత కరెన్సీ అందుబాటులోకి వచ్చిన నేపధ్యంలో కొంత మేర తగ్గి డిజిటల్ లావాదేవిలను మరింత ప్రోత్సహించాలన్నారు. ఆధార్ మొబైల్ సీడింగ్, బ్యాంకు అకౌంట్ల ఓపెనింగ్, ముద్రా లబ్దిదారుల విజయగాధలు ప్రసారం ఈ మేళాలో చేపడతారు. ఈ మేళాకు విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ఈ మేళా నిర్వహణకు అధికారులు బ్యాంకర్లతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సి.ఎస్. సూచించారు. దాదాపు 5000 మంది హాజరయ్యే అవకాశముందని, బ్యాంకులు దాదాపు 40 స్టాల్స్ ఏర్పాట్లు చేస్తాయని, ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ సుజనాచౌదరీ, రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి శ్రీ ఈటెల రాజేందర్ పాల్గొంటారని బ్యాంకర్లు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *