Breaking News

ముద్రగడ ఆమరణ దీక్ష.. ఏపీలో తీవ్ర ఉద్రిక్తం

mudragada-padmanabham

ఏపీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. కాపుల ఉద్యమ నేత మరోసారి సమరశంఖం పూరించారు. ఈ రోజు నుంచి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన సతీమణితో కలిసి ఆమరణ దీక్ష ప్రారంభించారు. తమ జాతికి తన జీవితం అంకితమిస్తున్నానని.. అందుకోసం తన ప్రాణాలు పోయిన ఫరవాలేదని.. ముద్రగడ అన్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు తన నివాసమైన తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ప్రారంభమైన ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్షతో ఏపీ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  ప్రతి ఒక్కరు గ్రామాల్లో తిండి మానేసి వీధుల్లో డప్పుల చప్పుళ్లతో నిరసన తెలపాలని ముద్రగడ పిలుపునిచ్చారు.. కాగా ముద్రగడ ఆమరణ దీక్షతో జిల్లా వ్యాప్తంగా  పోలీసులు అష్ట దిగ్బంధనం చేశారు. అల్లరి మూకలు, నాయకులు, కార్యకర్తలను ఇతర జిల్లాల నుంచి తూర్పుగోదావరి జిల్లాల్లోకి రానీయడం లేదు. ఒక్క ముద్రగడ దీక్ష చేస్తున్న కిర్లంపూడి చుట్టే 5 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఆందోళనకారులను అదుపు చేస్తున్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *