
కరీంనగర్: సమాజహితం కొరకు అహర్నిషలు కృషి చేస్తున్న అవినీతిని ఎదిరించే కర్తవ్య బోధకవి. ‘‘కాళోజీ అవార్డు’’గ్రహీత ‘‘అవార్డుల అగ్రగామి’’ముదుగంటికి మరో జాతీయ అవార్డు వరించింది. తెలంగాణ రాష్ట్ర్ర హెల్ప్ ఫుల్ ఫౌండేషన్ హైదరాబాద్, స్వచ్ఛంద సంస్ధ అధ్యక్షురాలు ‘‘మేఘమాల’’శనివారం ఉదయం ముదుగంటికి ఈ అవార్డు ప్రకటించారు. సమాజ చైతన్యానికి అవినీతి రహిత సమాజ నిర్మాణానికి, వినియోగదారుల్లో చైతన్యాన్ని నింపడానికి, పాఠకులలో పఠనాసక్తిని పరిజ్ఞానాన్ని పెంపొందిచడానికి, పౌరులను ప్రభావితం చేయడానికి తనదైన శైలిలో, వినూత్న రీతిలో కొనసాగిస్తున్న పలు కార్యక్రమాల పరంపరను ఉద్యమాలే ఊపిరిగా, అవినీతి అంతమే తన ధ్యేయంగా అనేక కవితలు రచిస్తున్న ముదుగంటి సుధాకర్ రెడ్డికి భారత మాత ముద్దుబిడ్డ, బహ్ర భాష కోవిదులైన తెలంగాణ తేజస్వి, అపరచాణిక్యుడు, రాజనీతి చతురత కలిగిన అప్పటి భారత ప్రధాని ‘‘పి.వి. నర్సింహరావు జాతీయ అవార్డును’’ముదుగంటి సుధాకర్ రెడ్డి కి ప్రకటించడం పట్ల తెలంగాణ రాష్ట్ర్ర ఉప ముఖ్యమంత్రి ‘‘కడియం శ్రీహరి’’, తెలంగాణ రాష్ట్ర్ర ప్రభుత్వ సలహదారు సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారులైన ‘‘డా!! కె.వి రమణా చారి ‘‘పి. జనార్ధన్ రెడ్డి’’, తెలంగాణ రాష్ట్ర్ర కోఆపరేటివ్ బ్యాంకు అధ్యక్షులు ‘‘కొండూరు రవీందర్ రావు’’, రాష్ట్ర్ర సి.పి.ఐ కార్యదర్శి ఎక్స్ యం.ఎల్.ఎ. ‘‘చాడ వెంకట రెడ్డి’’, రాష్ట్ర్ర సీనియర్ సిటిజన్ రాష్ట్ర్ర అధ్యక్షులు ఎక్స్ యం.ఎల్.ఎ ‘‘ఉచ్చిడి మోహన్ రెడ్డి’’, జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షురాలు ‘‘తుల ఉమ’’, రాజేందర్ లు లిమ్కా బుక్ రికార్డ్, యునెస్కా ఇంటర్ నేషనల్ అవార్డు గ్రహీత సత్య తిరునగరి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ భాష పరిరక్షణ సమితి అధ్యక్షులు ఎమ్.వి. నర్సింహరెడ్డి, మానేరు పర్యావరణ సమితి అధ్యక్షులు తోట లక్ష్మణ్ రావు,
సహధ్యక్షులు సముద్రాల జనార్ధన్ రావు హర్షం ప్రకటించారు.