
*తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు తుది దశకు చేరుకుంది. క్షేత్రస్థాయి పరిస్థితులు, డిమాండ్లపై నేతల అభిప్రాయాలు తెలుసుకునేందుకు జిల్లాల వారీగా నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. ఈరోజు కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్ జిల్లా నేతలతో ముఖ్యమంత్రి చర్చించారు. ఇప్పటికే ప్రతిపాదించిన 17 కొత్త జిల్లాలతోపాటు మరో నాలుగు కొత్త జిల్లాలకు సీఎం సానుకూలత వ్యక్తం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై నాయకుల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైందని కేసీఆర్ అన్నారు. 31 జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా కసరత్తు జరపాలని నిర్ణయించినట్లు చెప్పారు. కొత్తగూడెం కేంద్రంగా ఏర్పడే జిల్లాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా పేరు, వికారాబాద్ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు వికారబాద్ పేరు, మహబూబాబాద్ జిల్లా పేరును అలాగే కొనసాగించాలని సీఎం పేర్కొన్నారు. సిరిసిల్ల కేంద్రంగా ఏర్పడే జిల్లాకు రాజన్న పేరు పెట్టాలనే ప్రతిపాదన ఉన్నట్లు చెప్పారు.*
పెద్దపల్లి నగరపంచాయతీని మున్సిపాలిటీగా మార్చాలని, వరంగల్ గ్రామీణ జిల్లా కేంద్రాన్ని కూడా వరంగల్ నగరంలోనే ఏర్పాటు చేయాలని, స్టేషన్‌ఘన్‌పూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నాలుగు జిల్లాల ప్రతిపాదనలపై కసరత్తు చేయాలని.. కేశవరావు కమిటీ నివేదిక తెప్పించుకుని తుది నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ వెల్లడించారు.
*2019 ఎన్నికల్లోనూ తెరాస గెలుస్తుందని ప్రతిపక్షాలుఅంటున్నాయని.. కావున మన ప్రణాళిక రాబోయే ఏడెనిమిదేళ్ల కోసం జరగాలని కేసీఆర్ అన్నారు.*
ఆసిఫాబాద్ కేంద్రంగా మరో జిల్లా
ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.* ఆదిలాబాద్‌లో కొత్తగా 16 మండలాలు ఏర్పాటు చేయాలన్నారు. బెల్లంపల్లి, ముథోల్ రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని, క్యాతంపల్లిని నగరపంచాయతీగా మార్చాలని ఆదేశించారు. బాసర కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.*
*కొత్త జిల్లాలు ఇవే..*
*?వరంగల్- 5 జిల్లాలు*
వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగాం
?కరీంనగర్ – 4 జిల్లాలు
కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల
*?మహబూబ్‌నగర్- 4 జిల్లాలు*
*మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి, గద్వాల*
*?మెదక్-3 జిల్లాలు*
మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి
*?రంగారెడ్డి-3 జిల్లాలు*
శంషాబాద్, వికారాబాద్, మల్కాజ్‌గిరి
*?నల్గొండ-3 జిల్లాలు*
నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట
*?ఆదిలాబాద్-4 జిల్లాలు*
ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్
*?నిజామాబాద్-2 జిల్లాలు*
నిజామాబాద్, కామారెడ్డి
*?ఖమ్మం-2 జిల్లాలు*
ఖమ్మం, కొత్తగూడెం
*హైదరాబాద్ యథావిధిగా కొనసాగనుంది.*