ముచ్చటగా ముగిసిన మంత్రి హరీష్ రావు మూడు రోజుల పర్యటన

కాళేశ్వరం పనులపై సంతృప్తి.
దేశంలో ఇరిగేషన్ రంగంలో నూతన శకానికి కాళేశ్వరం నాంది.
6 గ్రామాలు దత్తత తీసుకోనున్న ఏజెన్సీ లు.
సుందిళ్ళ, అన్నారం, మేడి గడ్డ బ్యారేజీ లపై భారీ రహదారులు.
-మంత్రి హరీష్ రావు.

రిగేషన్ మంత్రి హరీశ్ రావు మూడు రోజుల పాటు జరిపిన కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన బుధవారం రాత్రి
ముగిసింది. కాళేశ్వరం పనుల పురోగతి పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మేడిగడ్డలో విలేకరుల
సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆరు సంవత్సరాల నుంచి పదేళ్ల వ్యవధిలో పూర్తయ్యే ఇలాంటి భారీ
ప్రాజెక్టును ఇరవై నెలల్లో పూర్తి చేయనున్నట్టు హరీశ్ రావు చెప్పారు. భారత దేశంలో ఇరిగేషన్ రంగంలో
నూతన శకానికి, కొత్త అధ్యాయానికి కాళేశ్వరం నాంది పలక బోతున్నదని అన్నారు.అత్యంత వేగంగా అటవీ,
పర్యావరణ అనుమతులు సాధించడం ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనత అని అభిప్రాయపడ్డారు.
గోదావరి నీరు వీలైనంత వేగంగా తెలంగాణ ప్రజలకు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.మునుపటి ప్రాణహిత డిజైన్లో తమ్మిడి హట్టి వద్ద నీటిలభ్యత లేదని సి.డబ్ల్యు. సి తే ల్చడంతో సి.ఎం.కేసీఆర్ మేడిగడ్డ ను ఎంపిక చేశారని హరీశ్ రావు గుర్తు
చేశారు.ప్రాణహిత – చేవెళ్ల పునరాకృతి సరైనదేనని కేంద్ర ప్రభుత్వమే నిర్ధారించిందని హరీష్ రావు
చెప్పారు.వచ్చే జూన్, జూలై నాటికిసుందిళ్ళ, అన్నారం ఆనకట్టలను పూర్తి చేస్తామన్నారు.
మేడిగడ్డ బ్యారేజీని 2018చివరి నాటికి పూర్తి చేస్తామని హరీశ్ రావు ప్రకటించారు.
కాళేశ్వరంప్రాజెక్ట్ పనుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటున్నమనితెలియజేశారు.కాళేశ్వరం95, 96 శాతం భూసేకరణ పూర్తయిందని మిగతా భూసేకరణ కూడా కొద్దీ రోజుల్లోనే పూర్తి కానుందన్నారు.కన్నేపల్లి నుంచి అన్నారం వరకు తలపెట్టిన ఆప్రోచ్
కాలువ పనులు వేగవంతం చేస్తామని చెప్పారు. వచ్చే మే నెలకల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని
తెలిపారు.తానుమూడు రోజుల పర్యటనలో ఆనకట్టలు, పంప్ హౌజ్ ల తో పాటు డిజైన్ల అంశం పై కూడా చర్చించామని మంత్రి
తెలిపారు.
రాబోయే రోజుల్లో 15 రోజులకోమారు పర్యటించి పనులు పర్యవేక్షిస్తానని అన్నారు.ఈప్రాజెక్ట్ పూర్తయితే 125
కిలోమీటర్ల మేర నదిలో 365 రోజుల మేర నీరు నిల్వ ఉంటుందన్నారు.
సుందిళ్ళ, అన్నారం, మేడి గడ్డ ఆనకట్టలపై జాతీయ రహదారుల  ప్రమాణాలతో రోడ్ బ్రిడ్జ్ లు నిర్మిస్తామని
మంత్రి తెలియజేశారు.
భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా పంట పొలాలకు నీరిచ్చేలా చిన్నపాటి ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు
చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్టు హరీశ్ రావు పేర్కొన్నారు.మంథని అసెంబ్లీ నియోజకవర్గం లోని
ప్రతి ఎకరానికి సాగు నీరందుతుందన్నారు.
చిన్న కాళేశ్వరం ఎత్తిపోతలకు  బుధవారమే రెండో దశ అటవీ అనుమతులు వచ్చాయని చెప్పారు. ఈ పథకం
త్వరగా పూర్తి చేసి రెండు పంటలకు నీరిస్తామని చెప్పారు. ఈ ప్రాంతాల్లో అన్ని రకాలుగా మేలు
జరుగుతుందన్నారు.
గుత్తేదార్లు గ్రామాలను దత్తత తీసుకోవాలని చెప్పామని మేఘా
కంపెనీ మూడు, ఎల్ అండ్ టీ, ఆఫ్కాన్స్, నవయుగ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకొని కార్పోరేట్ సామాజిక
బాధ్యత కిందఅభివృద్ధి చేయడానికి ఒప్పుకున్నాయని మంత్రి తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తో పేద్దపల్లి జిల్లా మంథని రూపు రేఖలు మారనున్నట్టు మంత్రి హరీశ్ రావు బుధవారం
విలేకరుల సమావేశంలో చెప్పారు.అటు ఎస్.ఆర్.ఎస్.పి,ఇటు కాళేశ్వరం, చిన్న కాళేశ్వరం, మంథని లిఫ్ట్
పథకాలతో మొత్తం మంథని అసెంబ్లీ నియోజక వర్గం సమగ్రాభివృద్ధి చెందుతుందన్నారు. కాళేశ్వరం గొప్ప
పర్యాటక కేంద్రంగా మారుతుందన్నారు. మత్స పరిశ్రమ అభివృద్ధి చెందడం వల్ల ఎంతో మందికి జీవనోపాధి
లభిస్తుందన్నారు. నౌకాయానం అభివృద్ధి జరుగుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు.చిన్న కాళేశ్వరం లిఫ్టు
తో మంథని లో 40 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని ఆయన చెప్పారు.గోదావరి ఒడ్డున నీటి లభ్యత
లేని ప్రాంతాల ప్రజలు, రైతులకోసం సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీ లకు ఇరువైపులా లిఫ్టులు ఏర్పాటు
చేసి సాగునీటిని అందించనున్నట్టు ఇరిగేషన్ మంత్రి తెలిపారు.

2 3 4 6 (1) 7 9 (1) 9 (2) 10 11 12

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *