Breaking News

తెలంగాణ కే ఆణిముత్యాలు ఈ ముగ్గురు ఐఏఎస్ టాపర్ లు

ముగ్గురు ఐఏఎస్ టాపర్ లు తెలంగాణ కు ఆణిముత్యాలు

అధికారులు పేదరికం ని అర్ధం చేసుకోకపోవడం వల్లనే దేశం ఇంకా మారలేదు

ఎంత ఎదిగిన ఎక్కడినుండి వచ్చామో మర్చిపోవద్దు

నేను స్వార్ధపరుణ్ణి … పేదరికం లేకుండా చేయడమే నా స్వార్థం.

ప్రపంచం లో గొప్పగా ఎదిగిన వాళ్ళెందరో పేదవాళ్ళే

పేదరికం శాపంకాదు స్ఫూర్తి కావలి

ప్రభుత్వాన్ని విమర్శించే నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి

ప్రజలే చరిత్ర నిర్మాతలు —- ఈటెల రాజేందర్, ఆర్ధిక మంత్రి

ముగ్గురు ఐఏఎస్ టాపర్ లు తెలంగాణ కు ఆణిముత్యాల లాంటి వారు.

గ్రామీణప్రాంతాల్లో అనేక సమస్యలు ఎదుర్కొంటు ఇంత ఘనత సాధించారు.

ప్రపంచంలో గొప్పవాళ్ళా చరిత్రను చూస్తే ప్రతి ఒక్కరు ఆకలితో బాధపడిన వారే , దుఃఖమును అనుభవించి వచ్చినవారే. పేదరికం శాపం కాకూడదు, పేదరికమే మీకు స్ఫూర్తి కావాలి దాన్ని అధిగమించి ముందుకు పోతు విజయం సాధించాలి. అప్పట్లో రాళ్లు ,పురుగులు ఎరుకొని తినలేక కళ్లలో నీళ్లు తిరిగేవి. కానీ తప్పలేదు. నేను స్కూల్ లో ఉన్నప్పుడు ..గాంధీ జ్ఞాన్ మందిర్ నుండి సచివాలయం వరకు అన్నం కావాలని ర్యాలీ తీసినం . మా ఆరాటం అన్నం కోసం అంతలా ఉండేది. అన్నింటినీ అధిగమించి తెలంగాణ రాష్ట్రం లో నేను తొలి ఆర్ధిక మంత్రి ని అయ్యాను,తొలి సివిల్ సప్లై శాఖకు మంత్రి ని అయ్యాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మేధావులతో సచివాలయంలో మీటింగ్ ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి . ఆ మీటింగ్ లో సన్నబియ్యం పెడదామంటే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అడ్డుపడ్డాడు. కానీ సీఎం గారు ఎంత ఖర్చు అవుతుంది అని ఆలోచించకుండా సన్నబియ్యం కి అనుమతి ఇచ్చారు. ఐఏఎస్ అధికారులుగా మీరు మరో 30 ఏళ్ళు పనిచేయబోతున్నారు. మీరు ఎక్కడినుండి వచ్చారో అది మర్చిపోవద్దు. మీరు ఈ సమాజం కోసం పని చెయ్యాలి. విదేశీ విద్యకోసం పేద పిల్లలకు 20 లక్షల రూపాయలు ప్రకటించిన దేశంలో నే మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దేశంలో 576 రెసిడెన్షియల్ స్కూల్ పెట్టిన రాష్ట్రం తెలంగాణ. ఒక్కో విద్యార్థికి 1లక్ష 5 వేల నుండి 1లక్ష 50 వేలు ఖర్చు పెడుతున్న రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఢిల్లీ కి పోతే చిన్న చూపు ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు . ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ పెరు వినిపిస్తోంది.నేను తెలంగాణ వాడిని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. అనుదీప్ ది మొదటి ర్యాంక్ తెలంగాణ ది కూడా మొదటి ర్యాంక్. నీళ్లు కోనుకొని త్రాగుతున్నాం, అన్నం కొనుక్కొని తింటున్నాం,ఢిల్లీ లో ఊపిరి ఆడడంలేదు అని వింటున్నాం అందుకే ఆ పరిస్థితి మనదగ్గర రాకముందే మొక్కలు నాటే హరితహారం కార్యక్రమం కు పిలుపునిచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. విద్యార్థులకు సూచన చేస్తున్న ని చేతిలో సైన్స్ ఉంది మీరు ప్రజాహితం కోసం వాడుకోవాలి. మీ హితం కోసం వాడాలి. సెల్ ఫోన్ లో అమ్మ నాన్నతో మాట్లాడని కానీ అమ్మాయిలను వేధించడానికి వాడకండి. యూట్యూబ్ లో అబ్దుల్ కలాం స్పీచ్ లు వినండి కానీ అశ్లీల వీడియో లు చూడకండి. మంచిని స్వీకరించి చెడును వదిలి వేయండి. ఈ ముగ్గురిని ఆదర్శంగా తీసుకొని మీరు గొప్పవాళ్ళు గా ఎదగండి అమ్మ నాన్న కన్న కలలను నిజం చేయండి. నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం లో బీసీ విద్యా వంతుల వేదిక ఆధ్వర్యంలో.. సివిల్స్ లో ర్యాంకులు సాధించిన వారికిఆత్మీయ అభినందన సత్కార సమావేశం ఏర్పాటు ముఖ్య అతిధులుగా హాజరైన మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ, బీసీ నేతలు జాజుల శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికైన బిసి ఐఏఎస్ టాపర్ లకు సన్మానం చేసిన మంత్రులు.

jogu ramanna

అనుదీప్, సాయితేజ, కృష్ణకాంత్ పటేల్ కు సన్మానం.

అనుదీప్ ఐఎఎస్ టాపర్. ప్రతి ఒక్కరికి నా ర్యాంక్ స్ఫూర్తి ని ఇవ్వాలి. నా విజయం నాఒక్కని స్వంతం కాదు ప్రతి విద్యార్థి స్వంతం. నేను 10వ తరగతి వరకు ఊర్లో నే చదివాను .లక్ష్యంతో చదివాను.ర్యాంక్ సాధించాను. రానున్న రోజుల్లో చాలా మంది ఐఏఎస్ టాపర్ లు వస్తారు . కష్టపడితే సాదించనిది ఏమి ఉండదు. సాయి తేజ ఐఏఎస్ ర్యాంకర్ జీవితంలో ఏది సాధించాలి అనుకుంటే అది సాధించవచ్చు. విజయం దూరంలో లేదు చాలా దగ్గరగా ఉంటుంది కష్టపడితే విజయం సాధించవచ్చు. జాజుల శ్రీనివాస్ గౌడ్ బిసి విద్యావంతుల వేదిక అధ్యక్షుడు బిసిలు చదువుకోవడం కోసం గురుకులలు ప్రవేశపెట్టిన ఘనత మన ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో బిసిలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. బిసి కులాల నుండి ఐఎఎస్ లు కావడం చాలా సంతోషం. వీళ్ళను ఆదర్శంగా తీసికొని ముందుకు పోవాలి. బడుగుబలహీన వర్గాల పట్ల మన మంత్రులు పనిచేస్తున్నారు. జోగు రామన్న బిసి సంక్షేమ శాఖ మంత్రి ఐఏఎస్ టాపర్ లకు ప్రభుత్వం తరుపున శుభాభినందనలు. లక్ష్యం పెట్టుకొని పనిచేస్తే ఫలితం మీదే, ప్రభుత్వ పరంగా అన్నివిధాల సహాయసహకరం అందిస్తాం. మన ముఖ్యమంత్రి కులాల తోటి సంబంధం లేకుండా ప్రభుత్వం తరుపున సహకారం అందిస్తున్నారు. హాస్టల్ లో చదివే విద్యార్థులు గతంలో చిన్న చిన్న సమస్యల తో రోడ్ మీద ధర్నాలు చేసేవారు కానీ ఇప్పుడు అలాంటిది ఎక్కడ లేదు బిసి రెసిడెన్షియల్ స్కూల్ దేశంలో ఎక్కడా లేవు, 119 స్కూల్ లు ప్రారంభించాం. వచ్చే విద్యాసంవత్సరం నుండి మరో 119 స్కూల్స్ ని ప్రారంభిస్తామని సీఎం గారు ప్రకటించారు. విదేశీ విద్య కోసం 20 లక్షల రూపాయలు అందిస్తున్నాం. స్టడీ సర్కిల్ లు ఉన్నాయి కానీ గతంలో నోటిఫికేషన్ వస్తేనే ఓపెన్ చేసేవారు కానీ ఇప్పుడు 24 గంటలు ఓపెన్ చేసే ఉంటున్నాయి. ఐఏఎస్ లకు కోచింగ్ ఇస్తున్నాం మీరు కష్టపడి చదవండి మంచి పేరు తేవాలి. ఎల్ రమణ టిటిడిపి అధ్యక్షుడు దేశంలోనే టాప్ ర్యాంక్ లు సాధించిన వారు ఇక్కడ ఉండడం విద్యార్థులకు మంచి స్ఫూర్తి. మీ సేవలు దేశానికి అందించి ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా నిలపాలని కోరుకుంటుంన్నాను. చాలా మంది మేధావులు ప్రభుత్వ స్కూళ్లలో చదువుకొని వచ్చినవారు. నిరంతరం బిసి బిడ్డల కోసం పని చేస్తున్న మంత్రులు జోగు రామన్న, ఈటెల రాజేందర్ గారికి కృతజ్ఞతలు.

jogu ramanna 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *