Breaking News

ముగిసిన మహానాడు, టీడీపీ జాతీయాధ్యక్షుడిగా బాబు

X0N_9159

హైదరాబాద్ : హైదరాబాద్ గండిపేటలో జరిగిన మహానాడు ముగిసింది. చివరిరోజు చంద్రబాబు ను టీడీపీ జాతీయాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా సభ ఆమోదించింది. జాతీయాధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం చంద్రబాబు ఉద్వేగభరిత  ప్రసంగం చేశారు. తెలుగు జాతిని శిఖర స్థాయికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. అత్యున్నతంగా నిలిపేందుకు కృషిచేస్తానని చెప్పారు. 2019లో తెలంగాణలో టీడీపీదే అధికారం అని స్పష్టం చేశారు.

ఏపీలో వైసీపీ లాంటి అవినీతి ప్రతిపక్షంతో యుద్ధం చేయాల్సిన అవసరం టీడీపీ కలగడం బాధాకరమన్నారు. అవినీతి కేసుల్లో జప్తు చేసిన అధికారులు, నాయకుల ఆస్తులు రాష్ట్రానికే దక్కేటట్టు చట్టం తెస్తామన్నారు.

తెలంగాణలోబడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటామన్నారు. ఉస్మానియా భూములను వదిలేసి భూములను కొని పేదలకు ఇళ్లు కట్టించాలని స్పష్టం చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *