
సిడ్నీ, ప్రతినిధి : సిడ్నీ టెస్ట్ లోనూ ఆస్ట్రేలియా జోరును కంటిన్యూ చేస్తోంది. టీమిండియా బౌలర్లు బాగా బౌలింగ్ చేసినా ఆస్ట్రేలియా టీం లీడింగ్ లో ఉంది. నాల్గొ టెస్ట్ లో లో టీమిండియా 475 రన్స్ కు ఆలౌట్ అయింది. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది ఆస్ట్రేలియా. ఆసీస్ ప్లేయర్ వార్నర్ ను త్వరగానే ఔట్ చేశాడు అశ్విన్. ఆ తర్వాత వాట్సన్, రోజర్, స్మిత్ ఔట్ అయ్యారు. ఆస్ట్రేలియా ఓపెనర్ బర్న్స్ 66 రన్స్ చేశాడు. నాల్గొ రోజు ఆట ముగిసే టైంకు ఆస్ట్రేలియా 251 రన్స్ చేసి 6 వికెట్లు కొల్పోయింది. ప్రజెంట్ గ్రీజులో హడిన్, హేరీస్ ఉన్నారు. భువనేశ్వర్, షమీ చెరో వికెట్ తీశారు.