జర్నలిస్టు హరి కిషన్ రెడ్డికి 10 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహయ నిధి అనుమతి పత్రాన్ని అందజేసిన అల్లం

ముఖ్యమంత్రి సహయ నిధి ద్వారా మంజూరైన 10 లక్షల రూపాయల అనుమతి పత్రం

ముఖ్యమంత్రి సహయ నిధి ద్వారా మంజూరైన 10 లక్షల రూపాయల అనుమతి పత్రాన్ని (letter of credit) తెలంగాణ రాష్ట్ర్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సీనియర్ జర్నలిస్టు డి. హరి కిషన్ రెడ్డికు అందజేశారు. నల్గొండ జిల్లాకు చెందిన హరి కిషన్ రెడ్డి సుదీర్గకాలంగా జర్నలిస్టుగా సేవలందిస్తూ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఇటీవల హృదయ సంబంద వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యారు. అపోలో వైద్యులు ఆయన్ను పరీక్షించి CRT-D implantation పరికరాన్ని అమర్చాలని, ఇందుకుగాను 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపారు. ప్రెస్ అకాడమీ, జర్నలిస్టు సంఘాల నాయకులుఈ విషయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకురాగా, ఆయన తక్షణం స్పందించి ముఖ్యమంత్రి సహయ నిధి ద్వారా 10 లక్షలు మంజూరు చేశారు.శనివారం నాడు ప్రెస్ అకాడమీ చైర్మన్ తన ఛాంబర్ లో ఆంధ్రభూమి బ్యూరో చీఫ్, సీనియర్ జర్నలిస్టు డి.హరి కిషన్ రెడ్డి కి 10 లక్షల రూపాయల అనుమతి పత్రాన్ని వ్యక్తిగతంగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ అకాడమీ, చైర్మన్ మాట్లాడుతూ, రాష్ట్ర్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం , అభివృద్ధికి చిత్తశుద్దితో కృషి చేస్తుందని తెలిపారు. జర్నలిస్టుల బాగోగులు పట్టించుకుంటున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. హరి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా రాష్ట్ర్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ సెక్రటరీ బి. రాజమౌళి, అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్.ఎ.హష్మి, మేనేజర్ జి. లక్ష్మణ్ కుమార్, సిబ్బంది వనజ, ఎన్.కె. రహ్మన్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *