ముఖేష్ అంబానీ కుమారుడి పెళ్లి కార్డు ఖరీదెంతో తెలుసా..?

ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ పెళ్లి కార్డు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ కార్డు ధర అక్షరాల లక్షా యాభైవేల రూపాయిలట. ఈ కార్డుకు సంబందించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్‌లో వైరల్‌గా మారింది. చూసిన వెంటనే షాకయ్యేలా అనిపించే ఈ వివాహ ఆహ్వాన పత్రికలో చాలా విశేషాలున్నాయి. కార్డు ఒక బాక్స్‌లా ఉంటుంది. ఓపెన్ చేయగానే విఘ్నేశ్వర ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయానికి చిన్నపాటి అద్దాల డోర్ ఉంది. డోర్ తెరవగానే వినాయక స్వామి కనిపిస్తారు. ఆలయంపైన వివాహ ఆహ్వాన పత్రిక ఉంది. ఆ పత్రికను ఓపెన్ చేస్తే చక్కగా పొందుపరిచిన వివాహ వివరాలు కనిపిస్తాయి. అందులో కార్డు పైన “ఓ సూర్యదేవా.. మా ఆకాశ్ జీవితంలో ఉన్న వెలుగు మీరే, మా శ్లోకాను మీరే ప్రకాశింపచేయండి” అని ఉంది. తర్వాత ముకేశ్ తల్లిదండ్రులు శ్రీమతి కోకిలా బెన్, శ్రీ ధీరుభాయ్ అంబానీల ఆశీస్సులతో అని ప్రస్తావించారు. త్వరలో మ్యారేజ్ డేట్ ప్రకటిస్తామని, ఆరోజును రిజర్వే చేయాలని కోరారు. చివరిలో ముకేశ్, నీతాలతో పాటు చిన్న కుమారుడు అనంత్ అంబానీ, కూతురు ఇషా అంబానీల పేర్లతో హృదయపూర్వక ఆహ్వానం పలికారు. ఈ వెడ్డింగ్ కార్డును ముకేశ్ సతీమణి నీతా అంబానీ ఇష్టపడి చేయించారట. ఆమె ఈ కార్డును విఘ్నశ్వర ఆలయంలో స్వామి సమక్షంలో ఓపెన్ చేసి ప్రత్యేకంగా పూజలు చేయించారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న తన కుమారిడి వివాహానికి ఆమె అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రముఖ వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహెతా కుమార్తె శ్లాకా మెహతాతో ముకేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్‌కు గత మార్చి 24 వ తేదీన గోవాలో నిశ్చితార్ధం జరిగిన సంగతి తెలిసిందే. త్వరలో వీళ్లు పెళ్లిపీటలెక్కబోతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపార దిగ్గజాలైన ఇరువరి పేరెంట్స్ అన్ని ఏర్పాట్లనూ అంగరంగ వైభంగా ఉండేలా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వెడ్డింగ్ కార్డుపై ముకేశ్ అంబానీ కుటుంబం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కార్డు ధర లక్షా యాభై వేలు ఉండటంతో అందరికీ ఆసక్తిగా మారింది. ఈ కార్డునే ఫైనల్ చేస్తే ఎంతమందికి ఇస్తారో, ఎన్ని లక్షల ఖర్చు అవుతోందోనంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *