
ముంబై లో ప్రేమికులకు స్వేచ్ఛనిస్తూ పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు ముంబై పోలీస్ కమిషనర్ అన్ని పోలీస్ స్టేసన్లు ఉత్తర్వులిచ్చారట.. ఇటీవల పోలీసులు హద్దులు మీరిన చాలా మంది ప్రేమ జంటల్ని పట్టుకొని వారి తల్లిదండ్రుల ముందు కౌన్సిలింగ్ ఇచ్చారట.. దీంతో ఒకమ్మాయి పోలీసులు తనను మానసిక క్షోభకు గురిచేశారని మా ఫ్రెండుతో కలిసి వెళ్లినా సంబంధం అంటగట్టారని సూసైడ్ నోటి రాసి ఆతహత్య చేసుకుంది. దీనిపై ఓ పత్రిక పతాక శీర్షిక కథనం వేయడంతో యువత ఆందోళన బాట పట్టింది..
దీంతో ముంబై పోలీసులు దిగివచ్చి యువతను, ప్రేమ జంటను ఇక నుంచి ముట్టకొవద్దని పోలీసులకు హుకూం జారీ చేశారట.. దీంతో ఇక ముంబైలో ప్రేమికులకు స్వేచ్ఛ దొరికినట్టే..