
కృష్ణ జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్లో వ్యభిచారం జరుగుతున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం వచ్చింది. సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం ముసుగులో వ్యభిచార గృహాన్ని ఓ హాస్యనటుడు బంధువు నిర్వహిస్తున్నారు. ముంబై,,చైన్నై తదితర ప్రాంతాల నుంచి మోడళ్లను రప్పించి ఇక్కడ వ్యభిచారం చేయిస్తున్నట్టు కొందరు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కొద్దిరోజులుగా ఇంటిపై నిఘా పెట్టారు. బుధవారం ముంబైకి చెందిన ఓ మోడల్ ను కాంట్రాక్టు పద్ధతిని తీసుకొచ్చారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఇంటిపై దాడి చేశారు.ముంబై మాడల్ మాట్లాడుతూ రోజుకు 10వేల చొప్పున కాంట్రాక్టుతో పాటు విమానం చార్జీలు, షెల్టర్ ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడికి వచ్చినట్లు చెప్పింది. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.