ముంబై పోలీసుల్లో దావూద్ అనుచరులున్నారు..

rajan4

ముంబై మాఫియా డాన్ చోటారాజన్ ఇండోనేషియాలోని బాలిలో పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే.. బాలీ లో కోర్టుకు తీసుకువస్తుండగా చోటారాజన్ మీడియాతో మాట్లాడారు..

తనను ఇండియాకు పంపాలని కానీ తనను ముంబై పోలీసులకు కాకుండా ఢిల్లీ పోలీసులకు అప్పగించాలని కోరారు. ముంబై  పోలీసులు కొందరు దావూద్ తో కుమ్మక్కయ్యారని.. వారు తనను బతకనీయరన్నారు. ముంబై పోలీసులకు ఎప్పటినుంచో దావూద్ తో సంబంధాలున్నాయని చోటారాజన్ ఆరోపించారు. అందుకే తనను న్యూఢిల్లీ పోలీసులకు అప్పగించాలని కోరారు.

మాఫియా డాన్ దావూద్ అంటే తనకు భయం లేదని.. 22 ఏళ్లుగా దావూద్ తో, ఐఎస్ఐతో భారత్ తరఫున తాను పోరాడుతున్నానని రాజన్ చెప్పారు. భారత్ మాత్రం తనపై కనికరం చూపించడం లేదని ఆరోపించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *