
ముంబై, ప్రతినిధి : బాలీవుడ్ లో ముంబై బార్ డ్యాన్సర్ యథార్థ గాథను బేస్ చేసుకుని నిర్మించిన ‘ముంబై కెన్ డ్యాన్స్ సాలా’ హిందీ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. త్వరలో బాలీవుడ్‌లో రిలీజ్‌కి రెడీ అవుతున్న సినిమాల్లో ఇదీ ఒకటి. సచ్చీంద్ర శర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని రంజీత్ శర్మ నిర్మిస్తున్నాడు. అషీమా శర్మ, రాఖీ సావంత్, ప్రశాంత్ నారాయణన్, ఆదిత్యా పంచోలిలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 2న విడుదలకానుంది.
తాజాగా ఈ సినిమా ట్రయలర్ ఆకట్టుకుంది.. ముంబై బార్ డ్యాన్సర్లకు సంబంధించిన రియల్ క్రైమ్ కమ్ హారర్ స్టోరీ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ తనకి మళ్లీ పాతరోజులు తీసుకురావడం గ్యారెంటీ అని రాఖీ సావంత్ చెబుతోంది.