ముంబైలో కేసీఆర్ కు విద్యాసాగర్ రావు ఆత్మీయ స్వాగతం

తెలంగాణ -మహారాష్ట్ర ల మధ్య నిర్మించ తలపెట్టిన పలు ప్రాజెక్టులకు నిర్మాణానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బృందం ముంబైకి చేరుకుంది. ప్రత్యేక విమానంలో ముంబై వెళ్లిన కేసీఆర్ అక్కడ దిగగానే మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఆహ్వానం మేరకు రాజ్ భవన్ కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ కు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం రాజ్ భవన్ లో సీఎం, మంత్రులు, అధికారులకు విద్యాసాగర్ రావు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. మంగళవారం మధ్యాహ్నం మహారాష్ట్ర సీఎంతో జరిపే చర్చలు, చేసుకునే ఒప్పందాలకు సంబంధించి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, అధికారులు, ఇంజనీర్లతో కేసీఆర్ చర్చలు జరిపారు.

02

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *