Breaking News

ముంబైకి ముప్పు

mumbai muppu

ఇప్పటికే ఎన్నోసార్లు ఉగ్రదాడులకు గురై తట్టుకుని నిలబడ్డ ముంబైకి మరోసారి ముప్పు పొంచి ఉందట. రిపబ్లిక్ డే ను టార్గెట్ చేసిన పాక్ లోని ఉగ్రవాద సంస్థలు అనేక నగరాల్లో విధ్వంసాలకు కుట్రలు పన్నుతున్నాయి. ముఖ్యంగా ముంబైపై విరుచుకు పడాలని ప్లాన్ చేసినట్టు నిఘా సంస్థలకు పక్కా సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.

ముఖ్యంగా ప్రముఖులు, సినీ తారలు పెద్ద సంఖ్యలో దర్శించుకునే సిద్ధి వినాయక్ ఆలయాన్ని టార్గెట్ చేయాలనేది ఉగ్రవాదుల ప్లాన్ లో భాగమట. అది ముంబైలో అతి ప్రముఖమైన ఆలయం. ఎప్పుడూ భక్తులతో కిటకిట లాడుతూ ఉంటుంది. వీఐపీ భక్తులూ పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

ఈసారి ఆ గుడిని టార్గెట్ చేయవచ్చనేది తాజా సమాచారం. భారత్ లో విధ్వంసాలకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఇప్పటికే నాలుగు యాక్షన్ టీములను మన భూభాగంలోకి పంపాయట. ఒకటి మహారాష్ట్రలో రెండో ది యూపీలో మూడోది ఒరిస్సాలో నాలుగోది రాజస్థాన్ లో ఉన్నట్టు నిఘా వర్గాలు చెప్తున్నాయి.

ముంబైతో పాటు ఇతర నగరాలకూ ముప్పు పొంచి ఉంది. గణ తంత్ర దినోత్సవం లోగా విధ్వంసాలకు పాల్పడాలనే లక్ష్యంతో ఉన్న ఉగ్రమూకల ఆచూకీని తెలుసుకోవడానికి ఇంటెలిజెన్స్ అధికారులు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *