ముంపు గ్రామాల ప్రజలు క్రొత్త నిర్మాణాలు చేపట్టరాదు: కలెక్టర్ నీతూ ప్రసాద్


కరీంనగర్: ప్రాజెక్టులు చేపడుతున్న ముంపు గ్రామాల ప్రజలు తమ భూముల్లో క్రొత్త నిర్మాణాలు చేపట్టకూడదని, వాటిని నోటిఫై చేయడం జరగదని, ఒకవేళ కట్టడాలు చేపడితే నష్టపోతారని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. గురువారం కలెక్టరేటు సమావేశ మందిరంలో అధికారులు, గౌరవెల్లి, గండెపల్లి తదితర గ్రామాల ప్రజలతో గౌరవెల్లి, గండెపల్లి రిజర్వాయర్ల భూసేకరణ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు 2009 వరకు 18 సం.రాలు నిండిన వారికే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి వర్తింపచేసారని, అలాకాక ఇప్పుడు 18 సం.రాలు నిండిన వారికీ వర్తించాలని ప్రజలు కోరారు. భూములు కొన్నచోటికి కరంట్ కనెక్షన్ తదితర సౌకర్యాలు బదిలి చేయాలని, ఆలస్యం చేయకుండా త్వరితగతిన ప్రయోజనాలు అందజేయాలని, భూ సేకరణ పోను మిగులు భూములు సాగుకు రోడ్డు తదితర సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ క్రొత్త నిబంధనల మేరకు అన్ని విధాల న్యాయం చేస్తామని, కట్టడాలకు ధర చేస్తామని, అసైన్ భూమి వుండి పట్టా లేకపోతే కాస్తులు వుండి పహణిలో పేరు ప్రకారం నష్ట పరిహరం అందిస్తామని అన్నారు. న్యాయబద్ధంగా అన్ని విధాల ముంపు ప్రజలకు మేలు చేస్తామని, త్వరితగతిన పని పూర్తి చేస్తామని, పరిహరం, ప్రయోజనాలు త్వరలో అందేలా చర్యలు తీసుకొంటామని, ప్రజలందరూ సహకరించాలని అన్నారు. అనంతరం అధికారులతో మిడ్ మానేరు పనుల
పురోగతిపై సమీక్షించారు. ముంపు గ్రామాల కట్టడాల విషయంలో ధర తదితర పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు. బాధితులకు నష్టపరిహరం అందజేపే పనిలో వేగం పెంచాలని, అధికారులందరు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అన్నారు.

DSC_0065

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పౌసుమి బసు, ప్రత్యేక కలెక్టర్ వెంకటేశ్వర రావు, ఆర్డీవో కరీంనగర్ చంద్రశేఖర్, సిరిసిల్ల ఆర్డీవో బిక్షానాయక్, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, నటరాజ్, శంకర్, హౌజింగ్ పిడి నర్సింహరావు, ఇరిగ్రేషన్ ఆర్ అండ్ బి, పంచాయితిరాజ్ ఇంజనీర్లు, తహసిల్ధార్లు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *