ముందే సుదలాయించుకుంటున్న కేటీఆర్

01ktr

జీహెచ్ఎంసీ ఎన్నికల కోడ్ కూయకముందే టీఆర్ఎస్ సర్కారు అన్ని పనులు చక్కదిద్దుకుంటోంది.. దాదాపు 25 వేల కోట్లతో హైదరాబాద్ లో బహుళ అంతస్థుల భవానాల నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపనలు చేసేస్తున్నారు. మంత్రి కేటీఆర్ నిన్న తోటి మంత్రులతో కలిసి హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ మీదుగా భారీ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కేంద్ర మంత్రి పాల్గొన్న ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కు జనాభా ప్రాతిపదికన కేంద్రం 25 వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు..

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ పై కేంద్రానికి ప్రేమ లేదని.. దాదాపు 25 వేల కోట్లతో రాష్ట్రప్రభుత్వం పలు పనులు చేపడుతున్నా అందుకు సహకరించడం లేదని దత్తాత్రేయను చూస్తూ అన్నారు. దీనికి ఎరక్కపోయిన ఇరికిపోయిన దత్తాత్రేయ తాను సహకరిస్తానని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *