Breaking News

ముందస్తు జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా …

resized_DSC_9890

ముందస్తు జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా వడగాల్పుల వలన జరిగే మరణాలను తగ్గించవచ్చని NDMA మెంబరు శ్రీ ఆర్.కె. జైన్ తెలిపారు. బుధవారం డా. మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్ధలో “ వడగాల్పులపై కార్యచరణ ప్రణాళిక ” అనే అంశంపైన రెండు రోజుల రిజనల్ వర్కుషాపు నిర్వహించారు. వర్కుషాపును ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ముందస్తుగా కార్యచరణ ప్రణాళిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వాలకు పంపి అమలు చేయ్యడం వలన 2015 కంటే 2016 లో మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించగలిగామని అన్నారు. వాతావరణ శాఖ సహకారంతో వడగాల్పులపై ముందస్తు హెచ్చరికలను జారీ చేయడం వలన ప్రజలు అప్రమత్తమైనారని అన్నారు. వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకొని వివిధ సంస్ధలు, రాష్ట్ర ప్రభుత్వాల సలహాలను, సూచనలను స్వీకరించి కార్యచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలిపారు. NDMA సంస్ధ ఒక్కటే ఈ చర్యలు చేపట్టలేదని అందరి సహాయ సహకారం అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. 2016 లో కొన్ని రాష్ట్ర ప్రభు త్వాలు ప్రణాళికలను అమలు చెయ్యడం ద్వారా మంచి ఫలితాలను సాధించారని అన్నారు. ప్రత్యేకంగా ఉపాధి హామి కార్మికులకు కల్పించాల్సిన సౌకర్యా లపై, దృష్టి పెట్టాలని అన్నారు. ప్రసారమాధ్యమాల ద్వారా ప్రజలలో వడగాల్పులపై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ అంశంపై డాటాను సేకరించడం వలన ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవాలో ప్రణాళిక వేయవచ్చునన్నారు. వడగాల్పుల పైన ప్రజలను అప్రమత్తత చెయ్యడానికి గాను అనుసరించాల్సిన ప్రణాళికపై ఈ సమావేశంలో చర్చజరగాలని అన్నారు. ఈ వర్కుషాపు అనంతరం సమగ్రమైన నివేదిక రూపొందించబడుతుందని తెలిపారు.

NDMA మెంబరు శ్రీ డిఎన్ శర్మ మాట్లాడుతూ, వడగాల్పుల నుండి ప్రజలను అప్రమత్తత చెయ్యడానికి అవసరమైన ఇన్ ఫుట్స్ ఈ వర్కుషాపుద్వారా వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. నిపుణులు తమ నివేదికను అందించిన అనంతరం సమగ్రమైన ప్రణాళికను రూపొందించడం సాధ్యమవుతుందని అన్నారు. వడగాల్పులకు ప్రజలు గురిఅవ్వడానికి అనేక అంశాలు దోహదం చేస్తాయని అన్నారు. వ్యక్తుల జీవణ ప్రమాణాలు,వారి ఆర్ధిక పరిస్ధితి, పనిచేసే ప్రాంతంలో సౌకర్యాల లేమి తదితర అంశాల వలన వడగాల్పులకు గురి అవుతారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 2016 లో చక్కని కార్యచరణ ప్రణాళికను అమలు చెయ్యడం వలన మరణాల సంఖ్య తగ్గిందని అన్నారు.

NDMA జాయింట్ సెక్రటరి శ్రీ తిరుప్పుగజ్ మాట్లాడుతూ సాధారణ ఉష్ణోగ్రత కంటే 5 డిగ్రీలు ఉష్ణోగ్రత పెరిగినట్లయితే వేడిగాల్పులుగా గుర్తిస్తారని అన్నారు. మన దేశంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటినట్లయితే వేడిగాల్పులుగా గుర్తిస్తారని అన్నారు. 1992 నుండి 2015 వరకు ఒక అంచనా ప్రకారం 22 వేల మంది చనిపోయారని అన్నారు. 2015 లో 2400 చనిపోయినట్లు రికార్డు అయితే 2016 లో 1100మంది మరణించినట్లు రికార్డు అయ్యిందని అన్నారు. 2016 లో వడగాల్పుల వలన మరణాలు తగ్గడానికి కారణం వడగాల్పులపైన ప్రజలను అప్రమత్తత చెయ్యడం, ముందస్తు జాగ్రత్తలు సూచించడం అని తెలిపారు. డాటా అందుబాటులో లేకపోవడం వలని పూర్తిస్ధాయిలో వడగాల్పుల మరణాలను నివారించలేకపోతున్నారని అన్నారు.

డా. మర్రిచెన్నారెడ్డి, అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీ తిరుపతయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 2016 లో కార్యచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయడం వలన వడగాల్పుల వలన మరణాలను తగ్గించగలిగామని అన్నారు. వడగాల్పుల పైన ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం ద్వారా మెరుగైన ఫలితాలు వచ్చాయని అన్నారు. ప్రజలు తీసుకోవాల్సిన ఆహారం, ధరించాల్సిన దుస్తులు, జీవన విధానంలో మార్పు తదితర అంశాలపై అవగాహన కల్పించటం వలన వడగాల్పుల ప్రమాదం నుండి ఉపశమనం లభిస్తుందని అన్నారు.

స్పెషల్ కమీషనర్,డిసాస్టర్ మేనేజ్ మెంటు సధా భార్గవి స్వాగతోపన్యాసం చేశారు.

—————————————————————

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *