
కొన్ని నెలల క్రితం భారీ వర్షాలు, వరద చైన్నైని అతలాకుతలం చేసింది.. దాన్నుంచి తేరుకోకముందే మరో ఉపద్రవం వస్తోంది. బంగాళఖాతంలో భారీ వాయు గుండం ఏర్పడింది. చైన్నైకి ప్రస్తుతం 90 కి.మీల దూరంలో ఇదీ కేంద్రీ కృతం అయి ఉంది. తీవ్ర వాయుగుండం తో చైన్నై సహా తమిళనాడు ఉత్తర ప్రాంతం, ఆంధ్రా దక్షిణ ప్రాంతంలో కుంభవృష్టి కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇప్పటికే చైన్నై తీరప్రాంతం, సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్య్స కారుల్ని చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. మరోసారి చైన్నై ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. కొన్ని నెలల క్రితం కనీసం తినడానికి తిండి దొరకక జనం పడ్డ అవస్థలు అందరి మదిలో ఉన్నాయి. మరోసారి అలా జరుగుతుందా అని జనం భయపడుతున్నారు.