Breaking News

ముంచెత్తుతున్న ఫోన్లు..

maxresdefault

అదిరిపోయే ఆఫర్లు.. అద్బుతమైన ఫీచర్ల ఫోన్.. కొనాలనిపించేలా డిజైన్లు.. అందుకే ఇప్పుడు ఏడాది కింద ఫోన్ అయినా సరే.. 6 నెలలు తిరిగేసరికి పాతదైపోతోంది.. దిగ్గజాలైన యాపిల్, సామ్ సంగ్ లకు పోటీగా రోజుకో ఉత్పత్తి దారు తమ ఉత్పత్తులతో మార్కెట్లను ముంచెత్తుతునానరు.. యాపిల్, సామ్ సంగ్ లను తలదన్నేలా మంచి ఫీచర్ ఫోన్లను తెరమీదకు తెస్తున్నారు. ఇంకేముందు 40,50 వేలు పెట్టి సామ్ సంగ్, యాపిల్ కొనేందుకు జనం ఇష్టపడడం లేదు.. అదే ఫోన్ 10 వేల ధరల్లో లభ్యమవుతుండడం..  జనాలు వాటినే కొనేందుకే ఇష్టపడుతున్నారు.. ర్యామ్, కెమెరాలు, తదితర ఫీచర్లు అచ్చం యాపిల్, సామ్ సంగ్ లకంటే కూడా ఎక్కువే ఉండడంతో ఈ ఫోన్లను కొనడానికి ఇష్టపడుతున్నారు..కాగా ఫోన్ల అమ్మకాల్లో యాపిల్, సామ్ సంగ్ లు వెనకబడుతున్నాయి.. ముఖ్యంగా ఇండియాలో కొత్తగా వస్తున్న భారతీయ బ్రాండ్లు చైనా కంపెనీలతో టై అప్ అయ్యి అదిరిపోయే తక్కువ ధర ఫోన్లను తీసుకొస్తున్నాయి.. వీటి అమ్మకాలు పెరిగి ఇప్పుడు సామ్ సంగ్, యాపిల్ లు కూడా ధర తగ్గించి ఫోన్లను విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది..

మైక్రోమాక్స్ , లావా, కార్బన్, సెల్ కాన్, కూల్ పాడ్, జోలో తదితర భారతీయ బ్రాండ్లు ఇప్పుడు తక్కువ ధర అమ్మకాలతో యాపిల్, సామ్ సంగ్ లనే వెనక్కి నెడుతున్నాయి.. ఈ అహ్లాదకర పోటీ వినియోగదారులకు తక్కువ ధరకు మంచి ఫోన్లను తెచ్చిపెట్టి ఆనందింపచేస్తున్నాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *