
ఐక్యరాజ్య సమితిలో అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్ తదితర అగ్రదేశాలకు ఉన్న శాశ్వత సభ్యత్వ హక్కును తమకు ఇవ్వాలని భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్ డిమాండ్ చేశాయి.. భారత ప్రధాని నరేంద్ర మోడీ మొన్న ఐక్యరాజ్యసమితిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని.. ఐక్యరాజ్యసమితిలో పూర్తిగా సంస్కరించాలని.. వందేళ్లనాటి విధానాలను విడనాడి భారత్ వర్ధమాన అభివృద్ధి దేశాలకు సభ్యత్వం ఇవ్వాలని కోరారు.
న్యూయార్క్ లో నాలుగు దేశాల గ్రూప్ సమావేశం నిర్వహించారు. దీనికి ఆతిథ్యం ఇచ్చిన భారత ప్రధాని ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో విశ్వసనీయతను, న్యాయబద్దతను పెంచేందుకు భారత్ సహా మరికొన్న దేశాలను భాగస్వామ్యం కల్పించి శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు.