
ఢిల్లీ : సీఎం కేసీఆర్ నీతి అయోగ్ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లారు. ఈ సందర్భంగా ఈరోజు రాత్రి 7 గంటలకు మీటింగ్ జరుగనుంది. అంతకుముందు ఈరోజు మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిశారు. రాష్ట్రానికి రావాలసిన నిధులు, ఫైనాన్స్ కమిషన్ విడుదల చేయాల్సిన నిధులపై కేసీఆర్ అరుణ్ జైట్లీని కలిసి కోరారు. ఎఫ్ఆర్బీఎఫ్ పై నిధుల వాటాను పెంచాలని కేసీఆర్ కోరారు.
హెచ్ ఎండీఏ పరిధిలో సేవాపన్నును తొలగించాలని, కరువు మండలాలను గుర్తించి నిధులు కేటాయించాలని, ధనిక రాష్ట్రమైనందున నిధుల రుణాల కోసం అనుమతివ్వలని కోరారు.
ఈ సందర్బంగా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ మీ పథకాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను ఆకర్షిస్తున్నాయని.. వాటిని తీసుకొచ్చిన కేసీఆర్ కు ప్రశంసలు కురిపించారు.