Breaking News

మీ కంటే ఒక లక్ష ఎక్కువే ఇచ్చాం బాబూ..

formars suside

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై మీడియా, ప్రతిపక్షాలు కోడై కూస్తున్నా స్పందించని తెలంగాన సర్కారు ఎట్టకేలకు రైతులపై ప్రేమ చూపింది.. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలపై వరాల జల్లు కురిపించింది.. విమర్శల నుంచి తప్పించుకునేందుకు భారీ ప్యాకేజీ అందించింది..

శనివారం సమావేశమైన తెలంగాణ కేబినెట్ మీటింగ్ రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ విస్తరణ అధికారుల రిక్రూట్ మెంట్ , అనాథలకు బీసీఏ లో చేర్చడంపై ఆమోదం తెలిపారు.

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 6 లక్షల సాయం చేసేందుకు తెలంగాణ కేబినెట్ మీటింగ్  నిర్ణయించింది.. ఈ మేరకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. 5 లక్షలు కుటుంబానికి ఆర్థికసాయం.. లక్ష రూపాయలు అప్పు తీర్చేందుకు సాయం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.. ఈ నిర్ణయం రైతుల కుటుంబాల్లో ఉత్సాహం నింపింది..

కాగా ఏపీ సీఎం చంద్రబాబు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.5 లక్షలు పెంచితే కేసీఆర్ ఏకంగా రూ.5 లక్షలతో పాటు అప్పు తీర్చేందుకు మరో లక్ష ఇచ్చి ప్రతిపక్షాలకు, ఏపీ సీఎం దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు. దీంతో తెలంగాణలో ప్రతిపక్షాల ఆందోళనలు ఇక ఉండకపోవచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *